నిశ్శబ్ధం కోసం సైలెంట్‌గా కానిచ్చేసిన స్వీటీ  

Anushka Huge Remuneration For Nishabdham - Telugu Anushka, Madhavan, Nishabdham, Remuneration, Telugu Movie News

టాలీవుడ్ స్వీటీ అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్ధం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ముగించుకుంది.

Anushka Huge Remuneration For Nishabdham

కానీ పలు కారణాల వల్ల వరుసగా వాయిగా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాలో అనుష్క ఓ మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తోంది.

కాగా ఈ సినిమాలో నటించినందుకు అనుష్క ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే అంశంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆమె అభిమానుల్లో కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.ఈ సినిమాలో నటించినందుకు అనుష్క ఏకంగా రూ.2.5 కోట్ల మేర రెమ్యునరేషన్ పుచ్చుకుందట.ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ పుచ్చుకున్న హీరోయిన్‌గా అనుష్క టాలీవుడ్‌లో రికార్డు సృష్టించిందని పలువురు అంటున్నారు.

అటు స్టార్ హీరోయిన్లు అయిన నయనతార, కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్‌గా రూ.కోటిన్నర తీసుకుంటున్నారు.అంటే అనుష్క తీసుకున్న రెమ్యునరేషన్ దాదాపు స్టార్ హీరోల రేంజ్‌తో ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా అనుష్క తన స్థాయికి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందని ఆమె అభిమానులు అంటున్నారు.మరి నిశ్శబ్ధం సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు

Anushka Huge Remuneration For Nishabdham-madhavan,nishabdham,remuneration,telugu Movie News Related....