మళ్లీ అదే అవతారంలో స్వీటీ

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ అనుష్క శెట్టి.ఒక్క అరుంధతి చిత్రంతో అమ్మడికి స్టార్ స్టేటస్ ఏ రేంజీలో వచ్చి పడిందో అందరికీ తెలిసిందే.

 Anushka Historical Roles Again Bhagamathi-TeluguStop.com

ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బాగా పేరు సంపాదించుకుంది.

అయితే బాహుబలి సినిమాలో చేసిన దేవసేన పాత్రకు ఆమెకు ఎలాంటి గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా తరువాత అనుష్క పలు విమర్శలు ఎదుర్కొంది.అయితే ఈ సినిమా తరువాత కూడా అనుష్క తనదైన ముద్ర వేస్తూ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఇప్పటికే భాగమతి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో మనముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు సరికొత్తగా నిశబ్దం అనే సినిమాతో రానుంది.అయితే ఈ సినిమా తరువాత మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపిందట అనుష్క.

ఈ సినిమాలో అనుష్క మరోసారి మార్షల్ ఆర్ట్స్‌లో చెలరేగిపోనుందని తెలుస్తోంది.

ఏదేమైనా సినిమా అవకాశాలు కాస్త తగ్గగానే తనకు పేరుతెచ్చిన పాత్రల్లో మరోసారి నటించేందుకు అనుష్క పన్నాగాలు పండుతోంది.

మరి ఈ పాత్రల్లో మరోసారి అనుష్క మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.ఏదేమైనా ఈ సినిమాతో మరోసారి అనుష్క తన క్రేజ్‌ను సాధించుకునేందుకు సిద్ధమవుతున్న మాట మాత్రం వాస్తవం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube