నాకు ఆ విషయంలో అనుష్క సహాయం చేసింది... తమన్నా కామెంట్స్

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.అందం, అభినయం కలగలిసి ఉన్న నటీమణులలో తమన్నా ఒకరు.

 Anushka Helped Me In That Tamanna Comment Actress Tamannah, Tollywood Actress-TeluguStop.com

శ్రీ అనే సినిమాతో తెలుగు తెర కు పరిచయమయిన తమన్నా పరిశ్రమకు వచ్చి 15 ఏళ్ళు అయినా ఇంకా అవకాశాలు అందుకుంటూనే ఉందంటే తమన్నా స్థాయి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు.అయితే హీరోయిన్ లు ఒకరికొకరు మాట్లాడుకోరని, హీరోయిన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే విధంగా ఉంటుందని బయట పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.

కాని అది అంతా అబద్ధపు ప్రచారం అని చాలా సార్లు రుజువైంది కూడా.హీరోయిన్ లు ఒకరికొకరు చాలా స్నేహంగా ఉంటారు.

ముఖ్యంగా తమన్నా, అనుష్క శెట్టి మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.అయితే అనుష్క తనకు 15 ఏళ్ల క్రితం చేసిన ఓ సహాయాన్ని తమన్నా గుర్తు చేసుకుంది.

నాకు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కాస్ట్యూమ్ డిజైనర్లు ఉండాలనే విషయం తెలియదని, అయితే కాస్ట్యూమ్ డిజైనర్ ఏర్పాటు చేసి తనకు సహాయం చేసిందని తమన్నా వెల్లడించింది.అయితే తమన్నా పరిశ్రమలో ఉన్న అందరితో మంచి స్నేహం చేస్తుంది.

ఎటువంటి వివాదాలకు తావు లేకుండా నడుచుకుంటూ ఇంకా స్టార్ హీరోయిన్ గా తమన్నా రాణిస్తోంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube