సంతోష్ శివన్ దర్శకత్వంలో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క  

సంతోష్ శివన్ దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్వీటీ అనుష్క..

  • దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క తన సినిమా కెరీర్ ప్రారంభించి ఇప్పటికి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఈ మంగళూరు భామ అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన అనుష్క బాహుబలి సినిమాతో తన ఇమేజ్ ను వరల్డ్ వైడ్ చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క లేడి ఓరియెంటెడ్ కథకు ఎక్కువ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

  • బాహుబలి తర్వాత భాగమతి అనే చిత్రంలో చివరగా నటించిన అనుష్క గ్యాప్ తీసుకుని మళ్లీ సైలెన్స్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కి సిగ్నల్ ఇచ్చింది. కోన వెంకట్ అందిస్తున్న ఈ సినిమా మా మెజారిటీ భాగం అమెరికాలో లో తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క మరో సౌత్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంతోష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది అని తెలుస్తుంది.