సెట్ లో వారికి క్లాస్ పీకీన అనుష్క.. మీ వల్లే జీవితాలు నాశనం అంటూ?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె స్వీటీ అనే పేరుకు తగ్గట్టుగానే ఎంతో స్వీటుగా సెట్ లో అందరితో కలివిడిగా ఉంటుంది.

 Anushka Give Class On The Set Do You Know Lives Are Spoiled Because Of You-TeluguStop.com

సూపర్ సినిమా ద్వారా వెండితెర ఆరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత అరుంధతి లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ సినిమాతో విజయ్కు జంటగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న అనుష్క ఆ తర్వాత వరుస సినిమాలతో అందుకున్నారు.

సినిమాలలోకి రాకముందు అనుష్క యోగా టీచర్ అనే సంగతి మనకు తెలిసిందే.

 Anushka Give Class On The Set Do You Know Lives Are Spoiled Because Of You-సెట్ లో వారికి క్లాస్ పీకీన అనుష్క.. మీ వల్లే జీవితాలు నాశనం అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈమె నిత్యం యోగా చేస్తూ.

ఆరోగ్య విషయం పై ఎంతో శ్రద్ధ వహిస్తారు.ఏ విషయమైనా ముక్కుసూటితనంగా ఎంతో అభినయంతో వ్యవహరించే అనుష్క ఒకానొక విషయంలో సెట్లో ఒక విషయం గురించి అందరి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యోగా చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనుష్క సెట్లో కొందరు పొగరాయుళ్లు పై పెద్ద ఎత్తున పొగత్రాగటంతో ఎంతో చిరాకు పడేది.ఈ క్రమంలోనే వారి దగ్గరకు సరాసరి వెళ్లి మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఎంతోమంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి అంటూ ఎడాపెడా వారిని తిట్టేది.

ఈ విధంగా సెట్ లో అనుష్క పొగతాగే వారిని చూస్తే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, ఇలా మేము ఎంత యోగా చేసిన ఏంటి లాభం మీలాంటి వాళ్లు ఉన్నంతవరకు మీకు మాత్రమే కాకుండా మాలాంటి వారి ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం అంటూ పొగరాయుళ్లు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో ఆమె సెట్లోకి అడుగు పెట్టగానే ఎవరైనా పొగ తాగుతూ కనిపించారు అంటే సరాసరి వారి దగ్గరకు వెళ్లి పొగతాగటం వల్ల మీ ఆరోగ్యం సంగతి దేవుడికి తెలుసు ఆ పొగ పైకి వెళ్లి దానిని పక్కవారు పీల్చుకోవడం వల్ల వారి ఆరోగ్యాల పాడవుతున్నాయి అంటూ ఈమె బాగా క్లాస్ పీకేది.

ఇలా ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఈ విషయంలో నిజంగానే ఈ స్వీటీ యోగా టీచర్ అనిపించుకున్నారు.

Telugu Anushka Serious Comments, Anushka Shetty, Class On Set, Heroine, Nagarjuna, Purijaganadh, Super Movie, Tollywood-Movie

ఎవరైనా సెట్లో ఇలా తిట్టడం ఏంటి అని ప్రశ్నిస్తే.ఈ విధంగా తాను ఒక సమాజ సేవ చేస్తున్నాం అంటూ ఈ టీచరమ్మ క్లాసులు చెప్పేది.మొత్తానికి సినిమా సెట్ లో అనుష్క ఉందంటే చాలా మంది పొగ తాగడానికి భయపడేవారు అని ఒకానొక సందర్భంలో వెల్లడించారు.

ఇక సెట్లో అందరితో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించే అనుష్క తన కెరీర్లో బాహుబలి వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ఎంతో గుర్తింపు పొందారు.అయితే బాహుబలి చిత్రం తర్వాత సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత ఏ విధమైనటువంటి సినిమాలను ప్రకటించలేదు.

#Anushka Shetty #Nagarjuna #Anushka #Class #Purijaganadh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు