మళ్లీ రిస్క్ చేస్తున్న అనుష్క.. అలాంటి కథలో..?

సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో స్టార్ హీరోల సినిమాల్లో గ్లామరస్ రోల్స్ లో ఎక్కువగా నటించిన అనుష్క గత రెండేళ్ల నుంచి పరిమితంగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.గతేడాది నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఆ సినిమాతో భారీ పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

 Anushka Fans Worried About Her Next Movie Story Rumours-TeluguStop.com

మీడియాకు సైతం దూరంగానే ఉన్న అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటన వెలువడింది.

రారా కృష్ణయ్య డైరెక్టర్ మహేష్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Anushka Fans Worried About Her Next Movie Story Rumours-మళ్లీ రిస్క్ చేస్తున్న అనుష్క.. అలాంటి కథలో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమా కథకు సంబంధించి వస్తున్న వార్తలు అనుష్క ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్నాయి.

ఈ సినిమా లవ్ స్టోరీ అని ఎక్కువ వయస్సు ఉన్న యువతి, తక్కువ వయస్సు ఉన్న యువకుడి మధ్య జరిగే ప్రేమకథ అని సమాచారం.

Telugu Anushka, Anushka Marriage, Anushka Next Movie, Fans, Love Story, Mahesh P, Naveen Polishetty, Next Movie Story, Rumours, Story Selection-Movie

స్టోరీ లైన్ బాగానే ఉన్నా ఇలాంటి కథలు హిట్టయ్యే అవకాశాలు తక్కువ.అయితే అనుష్క కొత్త సినిమా కథకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.వరుసగా ఫ్లాపులు వస్తున్న తరుణంలో అనుష్క ఇలాంటి రిస్కీ స్టోరీలను ఎంచుకోవడం గమనార్హం.

మరోవైపు అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు అభిమానులకు సమాధానం దొరకడం లేదు.

అనుష్కతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు ఇప్పటికే వివాహం చేసుకున్నారు.

ఈ మధ్య కాలంలో అనుష్క పెళ్లికి సంబంధించి వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.ఈ ఏడాదైనా అనుష్క పెళ్లికి సంబంధించిన ప్రకటన వస్తుందేమో చూడాల్సి ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించిన అనుష్కకు ఆఫర్లు కూడా తగ్గుతుండటం గమనార్హం.

#Anushka #Story Selection #Love Story #Mahesh P #Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు