అనుష్క పోస్ట్ చేసిన ఆ ఫోటోకి అభిమానులు ఎన్ని అర్ధాలు తీసుకుంటున్నారో చూడండి.! ఫాన్స్ కామెంట్స్ ఇవే!   Anushka Confirms Marriage With Instagram Post     2018-10-30   10:27:16  IST  Sainath G

అనుష్క…తెలుగు వారికి పరిచయం అక్కరలేని పేరు. ఎంతో మంది అగ్రహీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్. ఎన్నో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది అనుష్క. తన అందంతో, తన నటనతో మాత్రమే కాదు తన మంచితనంతో….బయట వేడుకల్లో ప్రవర్తించే తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క. ఆ మధ్య ప్రభాస్ తో అనుష్క పెళ్లి అనే పుకార్లు వచ్చాయి కానీ అవన్నీ అవాస్తవం అని తేల్చేసింది స్వీటీ.

తాజాగా అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన ఓ ఫోటో వైరల్ అయింది. దీనికి ‘నో క్యాప్షన్ రిక్వైర్డ్’ ని రాయడం ఆ ఫోటోలో కనిపిస్తున్నది కేవలం అనుష్క పాదం మాత్రమే ఉండడం. దీంతో అభిమానులు ఎన్నో ఊహించేసుకుంటున్నారు.

Anushka Confirms Marriage With Instagram Post-

త్వరలో తన పెళ్లి జరుగబోతోందనే అర్థం వచ్చేలా అనుష్క ఈ ఫోటోను పోస్టు చేసిందని అంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ పాదం త్వరలో పారాణితో దర్శనిమిచ్చే అవకాశం ఉందని అంటున్నారు.అనుష్క పాదం వేలి మధ్యలో మూడు ఆకులు పువ్వులా కనిపించడాన్ని గమనిస్తే… తన కాళ్లకు మెట్టెలు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ పరోక్షంగా తన పెళ్లికి సంబంధించి హింట్ ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనుష్క పెట్టిన ఈ ఫోటోపై చాలా మంది అభిమానులు స్పందించారు. కొందరు కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తే, మరికొందరేమో ప్లీజ్ మేడమ్ మీరు సినిమాల్లో కొనసాగండి అంటూ రిక్వెస్ట్ చేశారు.