అనుష్క ఈజ్‌ బ్యాక్‌ : ఫ్యాన్స్‌ సంతోషంతో కిందా మీద పడిపోతున్నారు, ఇంతకు ఏంటో తెలుసా?  

Anushka Birthday Special Nishabdam Tease Release-anushka Birthday Today,bahubali Actress Devasena

బాహుబలి చిత్రం తర్వాత అనుష్క ఆల్‌ ఇండియా లేడీ సూపర్‌ స్టార్‌ అవుతుందని అంతా ఊహించారు.కాని అనూహ్యంగా బాహుబలి చిత్రం తర్వాత అనుష్క ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క మూవీ భాగమతిని చేసింది.

Anushka Birthday Special Nishabdam Tease Release-anushka Birthday Today,bahubali Actress Devasena-Anushka Birthday Special Nishabdam Tease Release-Anushka Today Bahubali Actress Devasena

ఆ సినిమా తర్వాత బరువు తగ్గుతానంటూ గ్యాప్‌ తీసుకుంది.అనుష్క అంటే పడి చచ్చే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్‌ ఇండియా మొత్తం ఉన్నారు.వారు అనుష్క ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు.

ఎట్టకేలకు అనుష్క మూవీ రాబోతుంది.నేడు అనుష్క బర్త్‌డే సందర్బంగా ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘నిశబ్దం’ చిత్రం టీజర్‌ వచ్చింది.ఆ టీజర్‌ రావడమే ఆలస్యం రికార్డు స్థాయి వ్యూస్‌ను కట్టబెట్టారు.ఇప్పటి వరకు ఏ లేడీ ఓరియంటెడ్‌ మూవీకి దక్కని వ్యూస్‌ను ఇప్పటికే యూట్యూబ్‌లో నిశబ్దం మూవీకి వచ్చాయి.

అనుష్క ఈ చిత్రంలో మూగ అమ్మాయిగా కనిపించబోతుంది.హర్రర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మూగ అమ్మాయిగా అనుష్క పోషించబోతున్న పాత్ర అదిరిపోతుందని అంతా అంటున్నారు.

ఈ చిత్రంలో మాధవన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.భాగమతి పాత్రతో పోల్చితే ఈ చిత్రంలో అనుష్క సన్నబడటంతో పాటు మునుపటి గ్లో వచ్చింది.

ఆమె అందంకు మళ్లీ ఆమె ఫ్యాన్స్‌ చాలా సంతోషిస్తున్నారు.ఇక అనుష్క మళ్లీ జోరు పెంచాలంటూ వారు కోరుకుంటున్నారు.మొత్తానికి అనుష్క అందంతో రీ ఎంట్రీ ఇస్తున్న కారణంగా అభిమానులు కిందా మీద పడినంత సంతోష పడుతున్నారు.వారి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నారు.వారి ఆనందంను నిశబ్దం చిత్రం మరింతగా పెంచుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.