ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా డార్లింగ్ కు 'అనుష్క' ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా.?   Anushka Birthday Gift To Prabhas On His Birthday     2018-10-23   10:40:45  IST  Sainath G

సినీ అభిమానులు,సెలబ్రిటీలు డార్లింగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినీ స్టార్స్ కూడా ప్రభాస్ కి సోషల్ మీడియా వేదికపై శుభాకాంక్షలు చెప్పారు.బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో..ఇది వరకే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది…కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్బంగా ఈ రోజు ఓ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు ప్రభాస్ గత వారం ట్వీట్ చేసారు.

ప్రభాస్ పుట్టినరోజుకి ఎవరేం ఇచ్చినప్పటికీ కూడా..ఒకరు ఇచ్చే గిఫ్ట్ మాత్రం చాలా చాలా స్పెషల్..ఆ వ్యక్తే అనుష్క…ప్రభాస్ ,అనుష్క కలిసి ఇప్పటికి మూడు సినిమాల్లో నటించారు మిర్చి,బిల్లా,బాహుబలి..ఈ మూడు సినిమాల్లోనూ వీరిద్దరి పెయిర్ సూపర్ డూపర్ హిట్..రీల్ లోనే కాదు రియల్ గా కూడా వీళ్ల పెయిర్ అదుర్స్..సినిమాల్లో వీరి కెమిస్ట్రీని,రొమాన్స్ ని ఎంజాయ్ చేయని ప్రేక్షకుడుండడు.అవును రీల్ లైఫ్‌లో రియలిస్టిక్ రొమాన్స్‌ని తలపించేంత సహజంగా నటించడం ఈ హిట్ పెయిర్‌కే చెల్లింది. ఆ మధ్య వీరిద్దరి పెళ్లి అనే ఒక న్యూస్ కూడా వచ్చింది. కానీ మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఈ వార్తని కొట్టిపడేసారు ప్రభాస్ అనుష్క లు.

Anushka Birthday Gift To Prabhas On His Birthday-

ప్రభాస్ పుట్టిన రోజు సంధర్బంగా అనుష్క ఏం గిఫ్ట్ ఇచ్చిందంటే వాచ్.. ప్రభాస్ కి వాచ్ లంటే ఇష్టం..ఆ ఇష్టం గురించి తెలిసిన అనుష్క ప్రభాస్ కి డిజైనర్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చింది అనుష్క. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘దేవసేన’ అనుష్క డిజైనర్‌ వాచ్‌ను కానుకగా ఇచ్చినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రభాస్‌కి చేతి గడియారాలంటే చాలా ఇష్టమట. ఇందుకోసం అనుష్క ప్రభాస్‌కి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన వాచ్‌ కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది.