అనుష్క బికినితో రెడీ

చాలా కాలంగా ట్రెడీషనల్‌ లుక్‌లో కనిపిస్తూ వస్తున్న అనుష్క తన తాజా చిత్రం ‘సైజ్‌ జీరో’ సినిమాలో హాట్‌ హాట్‌గా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.అనుష్కతో ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఆర్య చేసే రొమాన్స్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.

 Anushka Bikini In Size Zero Movie-TeluguStop.com

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుష్క బికినిలో కనిపిస్తుందని, ఒక సీన్‌లో నిమిషం పాటు అనుష్క బికినిలో ఆన్‌ స్క్రీన్‌పై కనిపిస్తుందని చెబుతున్నారు.

అనుష్కకు బికిని కొత్త కాదు.

అయితే ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి సినిమాల తర్వాత అనుష్క బికిని వేస్తుందంటే అంతా కూడా కొత్తగా భావిస్తున్నారు.గతంలో ఈమె ‘బిల్లా’ సినిమాలో బికిని వేసి ఆకట్టుకుంది.

ఇప్పుడు మరోసారి తన అందాలను బికినిలో చూపించి మెప్పించే ప్రయత్నం చేస్తోంది.‘సైజ్‌ జీరో’ తర్వాత ఈమె వరుసగా గ్లామర్‌ పాత్రలే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

అందుకే ఈ సినిమాలో డోస్‌ కాస్త ఎక్కువగానే పెంచింది.తప్పకుండా ఈమె అందాలు సినిమాకు అదనపు ఆకర్షణ అవుతాయని అంటున్నారు.

ప్రనసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రకాష్‌ కోవెల మూడి దర్శకత్వం వహించాడు.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమాను అక్టోబర్‌ మొదటి వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube