పెళ్లికి ముందే గర్భం.. దర్శకుడిని ప్రశ్నించిన కూతురు..?

గడిచిన రెండు దశాబ్దాల్లో కాలం పూర్తిగా మారిపోయింది.ప్రస్తుతం పిల్లలు తమ తల్లిదండ్రులను బెస్ట్ ఫ్రెండ్స్ లా భావిస్తూ తమ సందేహాలను తల్లిదండ్రుల ద్వారా నివృత్తి చేసుకోవడంతో పాటు బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు.

 Anurag Kashyap Shares His Views Daughter Alliyah Boyfriend-TeluguStop.com

ఫాదర్స్ డే సందర్భంగా అనురాగ్ కశ్యప్, అలియా కశ్యప్ మధ్య సంభాషణకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఈ వీడియోలోని సంభాషణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలియా కశ్యప్ తన తండ్రి, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను పలు ప్రశ్నలు అడగగా అనురాగ్ కశ్యప్ ఆ ప్రశ్నలకు ఊహించని విధంగా సమాధానాలను ఇచ్చారు.

 Anurag Kashyap Shares His Views Daughter Alliyah Boyfriend-పెళ్లికి ముందే గర్భం.. దర్శకుడిని ప్రశ్నించిన కూతురు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలియా తన తండ్రిని తన బాయ్ ఫ్రెండ్ అయిన షేన్ గ్రెగోయిర్ ను ఇష్టపడుతున్నావా అని ప్రశ్నించగా గ్రెగోయిర్ చాలా మంచి వ్యక్తి అని అలియా కశ్యప్ మగ స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుందనే విషయం తనకు తెలుసని అనురాగ్ కశ్యప్ అన్నారు.

Telugu Akkiyah Boyfriend, Alliyah And Anurag Kashyap, Alliyah Kashyap, Anurag Kashyap, Fathers Day, Pregnancy Before Marriage, Shares His Views-Movie

బాయ్ ఫ్రెండ్ తో రాత్రి సమయంలో అమ్మాయిలు వెళ్లడం గురించి చెప్పాలని అలియా అనురాగ్ ను అడగగా పరిస్థితులు అప్పటికీ ఇప్పటికీ మారాయని భవిష్యత్తులో మరింత మారతాయని పిల్లలపై మన భయాలను, అభిప్రాయాలను రుద్దడం సరికాదని అనురాగ్ కశ్యప్ వెల్లడించారు.పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలని అలియా అడగగా అనురాగ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

Telugu Akkiyah Boyfriend, Alliyah And Anurag Kashyap, Alliyah Kashyap, Anurag Kashyap, Fathers Day, Pregnancy Before Marriage, Shares His Views-Movie

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెబితే నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తానని నువ్వు తీసుకున్న నిర్ణయంను గౌరవించడంతో పాటు మద్దతు కూడా ఇస్తానని అయితే ఆ నిర్ణయానికి మూల్యాన్ని మాత్రం నువ్వే భరించాల్సి ఉంటుందని కూతురుకు అనురాగ్ కశ్యప్ వెల్లడించారు.గతంలో శృంగారానికి సంబంధించిన కొన్ని పదాలను పలకడాన్ని సైతం నేరంగా చూసేవారని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చారు.

#Alliyah Kashyap #PregnancyBefore #Fathers Day #AlliyahAnd #Anurag Kashyap

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు