ఎందరో మహిళలకు ఆదర్శం అవుతున్న విజయగాధ..ఆమె ఎవరంటే!

ఈమె గురించి తెలుసుకుంటే మీరు కూడా ఈమె చాలా గ్రేట్ అని అనకుండా ఉండరు.ఈమె విజయగాధ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

 Anuradha A Tribal Women Success Story-TeluguStop.com

ఈమెను ఆదర్శంగా తీసుకుంటే సరైన మార్గంలో నడుస్తారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.బషీరాబాగ్ పీజీ న్యాయ కళాశాల గురించి అందులో పనిచేసే ప్రిన్సిపాల్ గురించి ఎంతో మందికి తెలిసుండదు.

పెద్దగా పట్టించుకోరు కూడా.

 Anuradha A Tribal Women Success Story-ఎందరో మహిళలకు ఆదర్శం అవుతున్న విజయగాధ..ఆమె ఎవరంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు మాత్రం ఈ కాలేజ్ గురించే అందరు మాట్లాడుకుంటున్నారు.

అందుకు కారణం కూడా ఉంది.ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఒక మహిళ కొద్దీ రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్నారు.

అప్పటి నుండి ఈ మహిళ ఎవరు.ఎక్కడి నుండి వచ్చింది.

అని ఈమె గురించిన సమాచారం సేకరిస్తున్నారు.ఈమె ఒక ఆదివాసీ మహిళ అట.ఈమె తెలుగు రాష్ట్రాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం సాధించిన మొట్టమొదటి మహిళ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక్కడతోనే ఈమె గురించి అయిపోలేదు.

ఈమె ఎవరో తెలుసా.ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసి ఇప్పుడు తన పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు అట.

Telugu A Tribal Women Success Story, Anuradha, Anuradha Success Story, Basheerbagh, Basheerbagh Pg College Principal, Former Mla Gummadi Narsayya Daughter, Pg College Principal, Success Story, Tribal Women-Latest News - Telugu

ఈమె పేరు గుమ్మడి అనురాధ.ఈమె ఎమ్మెల్యే కూతురు అని ఏనాడూ గర్వపడలేదు.ముందు నుండి సర్కారు స్కూల్లోనే చదువుకుంది.

ఆమెకు సివిల్స్ సర్వీస్ లో చేయాలనీ ఉన్న ఆ కల నెరవేరకపోయిన నిరుత్సాహ పడకుండా ఎల్ఎల్ఎం, పిహెచ్డి చేసి తాను చదివిన యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం సాధించి ఇప్పుడు బషీరాబాగ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమెను పలువురు ప్రముఖులు ప్రశంసలు అందించారు.

Telugu A Tribal Women Success Story, Anuradha, Anuradha Success Story, Basheerbagh, Basheerbagh Pg College Principal, Former Mla Gummadi Narsayya Daughter, Pg College Principal, Success Story, Tribal Women-Latest News - Telugu

ఎక్కడో ఒక మారుమూల ఆదివాసీ గ్రామంలో పుట్టిన ఈమె ఇప్పుడు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.ఈమె విజయగాధ ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చు.ఇప్పటి యువత ఈమెను ఆదర్శంగా తీసుకుంటే ఎంతో ఉన్నతంగా ఎదగడం ఖాయం.

#MlaGummadi #Anuradha Story #Tribal #Pg Principal #BasheerbaghPg

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు