హీరోయిన్ అనుపమతో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.ప్రేమమ్, శతమానం భవతి, రాక్షసుడు సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ఖాళీ సమయంలో తన ఇంటి దగ్గరే ఉన్న పొలంలో తపియోక దుంపలను పండించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

 Anupama With Her Brother Photo Goes Viral In Social Media-TeluguStop.com

అయితే తాజాగా అనుపమ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఫోటోలోని అబ్బాయి కూడా అచ్చం అనుపమ పోలికలతోనే కనిపిస్తూ ఉండటం గమనార్హం.

 Anupama With Her Brother Photo Goes Viral In Social Media-హీరోయిన్ అనుపమతో ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనుపమ తన తమ్ముడి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అనుపమ తమ్ముడి పేరు అక్షయ్ అని సమాచారం.

ఫోటోలో ఇద్దరూ క్యూట్ గా ఉన్నారని అనుపమ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండు సినిమాలు ప్రస్తుతం అనుపమ చేతిలో ఉన్నాయి.

ఈ రెండు సినిమాల రిజల్ట్ పైనే అనుపమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.చాలామంది మలయాళ హీరోయిన్లు తెలుగులో సక్సెస్ అయితే అనుపమ మాత్రం ఆ హీరోయిన్ల స్థాయిలో సక్సెస్ కాకపోవడం గమనార్హం.

ఇతర ఇండస్ట్రీల్లో సినిమా ఆఫర్లు వస్తున్నా ఈ హీరోయిన్ తెలుగుకే పరిమితం కావడం గమనార్హం.ఆరేళ్ల కిందట తెలుగు తెరకు పరిచయమైన అనుపమకు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు.

ఈ ఏడాదైనా విజయాలను సొంతం చేసుకొని అనుపమ మళ్లీ బిజీ హీరోయిన్ అనిపించుకుంటారేమో చూడాల్సి ఉంది.గ్లామరస్, హాట్ ఫోటోలను షేర్ చేస్తున్నా ఈ హీరోయిన్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు అయితే రావడం లేదు.

ప్రేమమ్ బ్యూటీగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ మల్లూ బ్యూటీ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ కాలేదు.

#Akshay #Social Media #Anupama Brother #AnupamaWith #AnupamaBrother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు