బూమ్రా పెళ్లిపై స్పందన అడిగిన రిపోర్టర్ కి చివాట్లు పెట్టిన అనుపమ

చాలా కాలంగా సౌత్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి ఇండియన్ క్రికెటర్ బూమ్రాకి మధ్య ఏదో రిలేషన్ ఉందనే టాక్ వినిపిస్తుంది.ఇద్దరు ప్రేమలో ఉన్నారని కూడా ప్రచారం జరిగింది.

 Anupama Serious Reply To Reporter On Bumrah Marriage-TeluguStop.com

అనుపమ పరమేశ్వరన్ ఫాలో అవుతున్న వారిలో బూమ్రా ఒక్కడే ఉండటంతో ఈ ప్రచారం ఎక్కువగా జరిగింది.అయితే ఈ విషయంపై అనుపమ పరమేశ్వరన్, అలాగే క్రికెటర్ బూమ్రా కూడా చాలా సందర్భాలలో క్లారిటీ ఇచ్చారు.

తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పారు.అయినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు.

 Anupama Serious Reply To Reporter On Bumrah Marriage-బూమ్రా పెళ్లిపై స్పందన అడిగిన రిపోర్టర్ కి చివాట్లు పెట్టిన అనుపమ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా బూమ్రా టెస్ట్ సిరీస్ కి దూరంగా ఉన్నాడు.పెళ్లి పీటలు ఎక్కబోతున్న సందర్భంగా టెస్ట్ మ్యాచ్ కి దూరమైనట్లు అతని మాటల బట్టి అర్ధమైంది.

ఇద సమయంలో ఆమె అందుబాటులో లేకపోవడంతో బూమ్రా, అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ ప్రచారం అయ్యాయి.అయితే ఈ గాసిప్స్ పై బూమ్రా స్పందించకున్న అనుపమ పరమేశ్వరన్ తల్లి రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.

అవన్నీ తప్పుడు వార్తలని అనుపమ షూటింగ్ నిమిత్తం గుజరాత్ లో ఉందని పేర్కొంది.ఇదే సమయంలో బూమ్రా ఓ స్పోర్ట్స్ ప్రెజెంటేటర్ ని పెల్లాడబోతున్నట్లు క్లారిటీ వచ్చింది.

వారి పెళ్లి గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ లా ప్లాన్ చేసుకున్నారని, కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ పెళ్లికి వెళ్తున్నారని బయటకి తెలిసింది.ఈ నేపధ్యంలో ఓ మీడియా ప్రతీతి ఏకంగా అనుపమ పరమేశ్వరన్ కి ఫోన్ చేసి బూమ్రా పెళ్లి వార్తలపై మీ స్పందనేంటి అని అడిగిందని తెలుస్తుంది.

అప్పటికే ఫ్రస్టేషన్ ఉన్న అనుపమ ఆ రిపోర్టర్ కి ఫుల్ గా చివాట్లు పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.అనవసరమైన విషయాలు ప్రచారం చేయడమే కాకుండా ఇలా ఫోన్ చేసి మరీ టార్చర్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు మీడియాలో గట్టిగా వినిపిస్తుంది.

.

#18 Pages Movie #Mallu Beauty #Kollywood #Bumrah Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు