ఆ హీరో తో అరక్షణమైనా నటించాలని ఉంది..! ఇంతకీ అనుపమ ఫేవరెట్ హీరో ఎవరు?       2018-06-17   03:26:31  IST  Raghu V

అప్పుడెప్పుడో మళయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో భాష అర్దం కాకపోయినా అందరూ తన అందానికి ఫిదా అయిపోయారు.ఆ తర్వాత తెలుగులో అఆలో సివంగిలా పలకరించిన ఆ గడుసుతనానికి ముచ్చటపడ్డారు..వరుసగా ప్రేమమ్,శతమానం భవతి,ఉన్నది ఒకటే జిందగీ సినిమాలతో మరింత ఆకట్టుకుని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బిజీగా ఉన్న అనుపమ శనివారం విజయవాడలో జరిగిన ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’ చిత్రం ఆడియో సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. ‘‘నా అభిమాన హీరో చిరంజీవి. ఆయన గొప్ప నటుడు.. చాన్స్‌ వస్తే చిరంజీవిగారితో అర నిమిషమైనా నటిస్తే నా జన్మ ధన్యమైనట్లే’’ అని హీరోయిన్‌ అనుపమా పరమేశ్వర్‌ అన్నారు.

నేను నటించిన ‘అ..ఆ’ చిత్ర విజయోత్సవం గుంటూరులో జరిగింది. అప్పుడే విజయవాడ గురించి, ఇక్కడ ఉన్న కనకదుర్గమ్మ ఆలయం గురించి తెలుసుకున్నాను. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉంది. నా అభిమాన నటి నిత్యామీనన్‌. సావిత్రిగారు గొప్ప నటి. ఆమె గురించి ఇటీవలే ‘మహానటి’ సినిమా చూసి తెలుసుకున్నాను. ప్రస్తుతం ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు బాగానే ఉన్నాయి. నా వరకూ బాగానే ఉంది. మంచి అవకాశాలు వస్తున్నాయి. రామ్‌ సరసన ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో నటిస్తున్నాను. నటిగా మంచి గుర్తింపు పొందాలనేది నా ఆకాంక్ష. ముందు తెలుగు మాట్లాడటం రాక ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం తెలుగు స్పష్టంగా మాట్లాడగలగడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.