ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన  అ. ఆ…  చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా  పరిచయమైన మలయాళ బ్యూటీ “అనుపమ పరమేశ్వరన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వచ్చి రావడంతోనే అందం, అభినయం, నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.హీరోయిన్ గా అయితే గుర్తింపు తెచ్చుకుంది కానీ  తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు ఇప్పటి వరకు ఈ అమ్మడికి సరైన అవకాశం రాలేదని చెప్పాలి.

 Anupama Parameswaran Shares Her Childhood Photo, Anupama Parameswaran, Telugu Ac-TeluguStop.com

దీంతో ఇప్పటివరకూ ఈ అమ్మడి కంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేదు.

అయితే ఈ మధ్య కాలంలో అనుపమా పరమేశ్వరన్  సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

 ఇందులో భాగంగా అప్పుడప్పుడు తన ఫోటోలను మరియు సినిమా సమాచార అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.కాగా తాజాగా అనుపమ పరమేశ్వరన్ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చిన్నప్పుడు తనభామ్మాతో కలిసి తీయించుకున్న ఫోటో ని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

అంతేగాక చిన్నప్పుడు తాను ఎలా ఉండేదాన్నో మీరే చూడండంటూ  కొంతమేర ఫన్నీగా క్యాప్షన్ పెట్టింది.అయితే ఈ ఫోటోని షేర్ చేసిన ఐదు గంటల లోపే దాదాపుగా 4 లక్షల 35 వేల పైచిలుకు లైకులు, కామెంట్లు వచ్చాయి.

 అంతేగాక చిన్నప్పటి అనుపమ పరమేశ్వరన్ చాలా క్యూట్ గా ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అనుపమ పరమేశ్వరన్  “మిడ్ నైట్ ఫ్రీడమ్” అనే షార్ట్ ఫిలింలో కీలక పాత్రలో నటించింది.

ఈ లఘు చిత్రాన్ని యూట్యూబ్ లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడికి ఎలాంటి సినిమా అవకాశాలు లేవు. ఈ మధ్య కాలంలో ఓ టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత మేనల్లుడు హీరోగా నటిస్తున్న చిత్రంలో పరమేశ్వరుని హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube