నిఖిల్ కి జోడీగా 18 పేజెస్ లో హీరోయిన్ గా ఎంపికైన అనుపమ  

Anupama Parameswaran Romance with Nikhil For 18 roses, Tollywood, Director Sukumar, bunny Vaas, Telugu Cinema - Telugu Anupama Parameswaran Romance With Nikhil For 18 Roses, Bunny Vaas, Director Sukumar, Telugu Cinema, Tollywood

అఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.మొదటి సినిమాతోనే ఆమె చేసిన నెగిటివ్ రోల్ లో నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.

 Anupama Parameswaran Romance With Nikhil For 18 Pages

తరువాత శతమానం భవతి సినిమాతో మొదటి సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది.ఇక అందంతో పాటు, అభినయం కూడా ఉండటంతో అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో హీరోయిన్ గా దూసుకుపోతుందని అందరూ భావించారు.

అయితే ఊహించని విధంగా ఈ అమ్మడుకి వరుసగా ఫ్లాప్ లు రావడంతో తెలుగు దర్శకులు ఈమె మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు.నటనతో పాటు గాయకురాలిగా కూడా మంచి టాలెంట్ ఉన్న ఈ అమ్మడు సొంత భాషలో బాగానే అవకాశాలు ఉన్నాయి.

నిఖిల్ కి జోడీగా 18 పేజెస్ లో హీరోయిన్ గా ఎంపికైన అనుపమ-Movie-Telugu Tollywood Photo Image

మరో వైపు ఈ అమ్మడుకి హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో దర్శకురాలిగా మారేందుకు ప్రయత్నం చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మల్లుబేబీకి చాలా గ్యాప్ తర్వాత తెలుగులో అదిరిపోయే ఆఫర్ వచ్చింది.

ఆమె చివరికి రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా నటించింది.తాజాగా యువ కథానాయకుడు నిఖిల్ సరసన ఆమె హీరోయిన్ గా ఎంపికైంది.నిఖిల్ కథానాయకుడుగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ పేరుతో సినిమా తెరకెక్కనుంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు.

బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు మొదలైంది.ఇక ఈ చిత్రంలోని కథానాయిక పాత్ర కోసం చాలా మంది అందాల భామల పేర్లు పరిశీలించి ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి.ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.

#Bunny Vaas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anupama Parameswaran Romance With Nikhil For 18 Pages Related Telugu News,Photos/Pics,Images..