అలా రామ్ చరణ్ తో రొమాన్స్ చేసే అవకాశం వదులుకున్న అనుపమ  

Anupama Parameswaran Reveals Why She Rejected Rangasthalam-

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న కథానాయికలలో మంచి టాలెంట్ ఉన్న నటి గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పరమేశ్వరన్.నార్త్ ఇండియా హీరోయిన్స్ మాదిరి అంగాంగ ప్రదర్శన చేయకుండా కేవలం కాళ్ళతో రొమాన్స్ ని పలికించే అతి కొద్ది మంది హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు.

Anupama Parameswaran Reveals Why She Rejected Rangasthalam--Anupama Parameswaran Reveals Why She Rejected Rangasthalam-

అఆ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తక్కువ టైంలో వరుసగా కుర్ర హీరోలతో జత కట్టే అవకాశాన్ని అందుకుంది.అయితే ఈ భామకి టాలీవుడ్ లో అంతగా అదృష్టం కలిసి రాకపోవడం చేసిన సినిమాలు అన్ని ఎవరేజ్ లేదంటే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

Anupama Parameswaran Reveals Why She Rejected Rangasthalam--Anupama Parameswaran Reveals Why She Rejected Rangasthalam-

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామ బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా రాక్షసుడు అనే సినిమాలో చేస్తుంది.ఇది తమిళ రాచ్చసన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది.త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది ఈ సినిమా సక్సెస్ మీద అనుపమ టాలీవుడ్ కెరియర్ ఆధారపడి ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తాను రంగస్థలం సినిమాలో అవకాశం కోల్పోవడం ఇప్పటికి బాధపడుతున్న అని చెప్పింది.ముందుగా రంగస్థలంలో సమంత పాత్ర కోసం సుకుమార్ అనుపమని సంప్రదించాడు.అయితే అదే సమయంలో తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉండటంలో ఆ అవకాశం వదులుకుంది.

అయితే రంగస్థలం సినిమా చూసిన తర్వాత ఆ పాత్రకి సమంత అయితే కరెక్ట్ అనిపించింది అని, అంత భాగా ఆమె ఆ పాత్రలో మెప్పించింది అంటూ అనుపమ సమంత మీద ప్రశంసలు కురిపించేసింది.మొత్తానికి రంగస్థలం సినిమా మిస్ చేసుకోవడంతో అనుపమ చాలా ఫీల్ అయ్యిందని ఆమె మాటలు బట్టి అర్ధమైంది.