తొలి అనుభవం గురించి అడిగిన నెటిజన్.. అనుపమ షాకింగ్ రిప్లై?

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 Anupama Parameswaran Reply To Fan On Asking First Audition Experience, Anupama,-TeluguStop.com

అయితే గత కొద్ది కాలం నుంచి తెలుగు ఇండస్ట్రీకి దూరమైన అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇక కెరీర్ పరంగా బిజీగా ఉన్న అనుపమ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తారు.

అయితే తన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారికి మాత్రం తనదైన శైలిలో సమాధానాలు చెబుతుంటారు ఈ కేరళ కుట్టి.ఇదిలా ఉండగా తాజాగా అనుపమ సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టారు.

ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు ఆమె పై ప్రశ్నల వర్షం కురిపించారు.మీకు ఏ భాష ఇష్టం? ఏ భాషలో మాట్లాడటానికి ఇష్టపడతారు?మీరు చేస్తున్న సినిమాలు ఏంటి అంటూ వివిధ ప్రశ్నలను అడిగారు.ఈ క్రమంలోనే తను మాతృభాష మలయాళం అయినప్పటికీ తన కళ్ళతో మాట్లాడే భాష అంటే చాలా ఇష్టం ఆ భాష తనకు బాగా తెలుసని వెల్లడించారు.ఇకపోతే తను ప్రస్తుతం కార్తికేయ 2,18 పేజెస్, తల్లి పొగతే, రౌడీ బాయ్స్ వంటి చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయని అయితే వాటి గురించి ఇప్పుడు మాట్లాడలేనని ఈమె వెల్లడించారు.

Telugu Anupama, Experience, Fans, Replay, Tollywood-Movie

ఇక పోతే మరొక నెటిజన్ ఈమెను ఉద్దేశిస్తూ మరో ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు.మీరు మొదటిసారి ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవం కలిగింది అనే ప్రశ్న అడగగా అందుకు అనుపమ స్పందిస్తూ ఆ అనుభవం గురించి ఇప్పుడు తలచుకున్నా తనకు ఎంతో నెర్వస్ గా ఉంటుందని సమాధానం చెప్పింది.ఇలా అభిమానులతో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించిన అనుపమ పరమేశ్వరన్ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ఎమోషనల్ అయ్యారు.

ఆయన ఒక మంచి నటుడని అతనితో కలిసి నటించడం జీవితంలో మరిచిపోలేని అనుభవం అని ఈ సందర్భంగా పునీత్ గురించి తలచుకొని ఎమోషనల్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube