నా లైఫ్ లో డబ్బు సెకండ్ ప్రయారిటీ అంటున్న అనుపమ

టాలీవుడ్ లో సక్సెస్ రేషియో పెద్దగా లేకపోయినా, చేసిన సినిమాలు తక్కువే అయిన నటిగా తనదైన ముద్ర వేసిన మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్.ఎక్కువగా ట్రెడిషనల్ లుక్, క్యూట్ గా కనిపించే అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.

 Anupama Parameswaran Said Importance Of The Money, Mallu Beaity, Tollywood, Telu-TeluguStop.com

గ్లామర్ రోల్స్ చేయకపోయినా ఆమె అందానికి ఫిదా అయిపోయిన ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.ప్రస్తుతం ఈ అమ్మడు నిఖిల్ కి జోడీగా సుకుమార్ ప్రొడక్షన్ లో తెరకెక్కబోయే 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తన కెరియర్ కి మంచి టర్నింగ్ అవుతుందని అనుపమ భావిస్తుంది.ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తన గురించి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో పంచుకుంటుంది.

ఈ కోవలోనే ఆమె దర్శకురాలిగా మారే ప్రయత్నం కూడా చేస్తుందనే విషయం చాలా మందికి తెలిసింది.

ఇదిలా ఉంటే ఈ భామ తాజాగా జీవితంలో తను డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత బయట పెట్టింది.

చిన్నప్పటి నుంచి నేనూ ఓ సగటు మిడిల్ క్లాస్ అమ్మాయిలాగే పెరిగాను.అందుకే నాకు ఆర్థికపరమైన విషయాల్లో అవగాహన ఉంది.కానీ డబ్బుల గురించి అదేపనిగా పట్టించుకోను.నాకు ఎంత రెమ్యూనరేషన్ వస్తుందో తెలుసు.

కానీ ఆ తర్వాత విషయాలన్నీ మా పేరెంట్స్ చూసుకుంటారు.పర్సనల్ లైఫ్ కోసం ఎక్కువ డబ్బు అవసరం లేదనేది నా అభిప్రాయం.

అయినా నాకు డబ్బుతో పెద్దగా పనేం ఉంటుంది.షాపింగ్ అంటే ఇష్టం లేదు.

బయటకి కూడా అప్పుడప్పుడు వెళ్తాను.హైదరాబాద్లో ఉన్నప్పుడు చేతిలో వెయ్యి రూపాయలు ఉంటే చాలేమో అనిపిస్తుంది.

యాక్టింగ్, సినిమా ఈ రెండు తప్ప నాకు మరో పిచ్చి లేదు.ప్రయాణించడానికి ఒక కారు ఉండటానికి మంచి ఇల్లు ఉంటే చాలు సంతోషంగా బ్రతికేస్తా అంటూ అనుపమ తన మనీ ఫిలాసఫీ చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube