సరికొత్త లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

ప్రేమమ్ సినిమాతో మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అనుపమ పరమేశ్వరన్.మొదటి సినిమాతోనే నటిగా మరో వైపు తన అందంతో కుర్రాళ్ళ గుండెల్లో వీణలు మోగించిన ఈ భామ అఆ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

 Anupama Parameswaran Mesmerizing Looks Viral, Tollywood, Telugu Cinema, South Be-TeluguStop.com

తరువాత శతమానం భవతి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఫస్ట్ హిట్ కొట్టింది.కళ్ళతోనే శృంగారాన్ని పండించే ఈ అమ్మడుకి స్మైల్ ఎక్స్ ట్రా గ్లామర్ తీసుకొస్తుంది.

ఆమె లుక్స్ కి ఎలాంటి వాళ్ళు అయిన ఈజీగా కనెక్ట్ అయిపోతారు.అయితే ఇంత అందం ఉన్న అనుపమకి అదృష్టం కలిసి రాలేదు.

దీంతో ఆమె చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ టాక్ తెచ్చుకొని సరైన గుర్తింపుని ఇవ్వలేకపోయాయి.అనుపమ చివరిగా రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా నటించింది.

తరువాత తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో సొంత బాషలో సినిమాలు చేస్తుంది.అక్కడ నటిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఈ అమ్మడు ఓనమాలు నేర్చుకుంది.

ఇదిలా ఉంటే మరల అనుపమ నిఖిల్ కి జోడీగా 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా ఖరారు అయ్యింది.

ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది.

అయితే చాలా గ్యాప్ తర్వాత మరల స్క్రీన్ ముందుకి రాబోతున్న అనుపమ ఊహించని లుక్ తో అందరిని మెస్మరైజ్ చేసింది.దిల్ రాజు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న అనుపమ కంప్లీట్ స్లిమ్ అయిపొయింది.

లాక్ డౌన్ ముందు వరకు బొద్దుగుమ్మగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు బ్లాక్ డ్రెస్ లో స్లిమ్ లుక్ లో మరింత హాట్ గా కనిపించింది.ఇప్పుడు అనుపమకి సంబందించిన లేటెస్ట్ లుక్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మళ్ళీ తెలుగు తెరపై సందడి చేయడానికి ఈ స్థాయిలో అందం ఉంటే సరిపోతుంది అంటూ నెటిజన్లు అనుపమ లుక్స్ చూసి కామెంట్స్ చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube