మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కన్నా ఇతర భాషల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారని చెప్పవచ్చు.ఈ విధంగా ఇతర భాషల నుంచి వచ్చి తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు.
అ ఆ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి ఆ తర్వాత శతమానం భవతి సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ క్రమంలోనే రాక్షసుడు, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాలలో నటించారు.ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కు పెద్ద హిట్ లేకపోవడమే కాకుండా సినిమా అవకాశాలు కూడా తగ్గినట్టు తెలుస్తోంది.అయితే గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండటం వల్లనే ఈమెకు అవకాశాలు రావడం లేదని చెప్పవచ్చు.
ఇదిలా వుండగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నారు.తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను షేర్ చేసింది.
అయితే హద్దులు మించి గ్లామర్ చూపించకుండా చీరకట్టులో హాట్ బ్యాక్ ని ఎక్స్ పోజ్ చేస్తున్న అనుపమ ఫోటోస్ స్టన్నింగ్ అనిపంచే విధంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే అనుపమ గ్లామరస్ ఫోటోలకు హీరోయిన్ రాశి ఖన్నా ఫిదా అవడంతో బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తమిళ తెలుగు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే తెలుగులో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న అటువంటి 18 పేజెస్, కార్తికేయ 2 చిత్రాలలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ బ్యూటీ ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా చీరకట్టులో తన గ్లామర్ వయ్యారాలను ఒలకబోస్తూ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.