కార్తికేయ సీక్వెల్‌కు దండం పెట్టిన మలయాళ బ్యూటీ  

Anupama Parameswaran Karthikeya 2 - Telugu Anupama Parameswaran, Chandoo Mondeti, Karthikeya 2, Nikhil

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రాల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ చిత్రం ‘కార్తికేయ 2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు జీవం పోయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.

 Anupama Parameswaran Karthikeya 2

ఈ సినిమాలో హీరోగా నిఖిల్ నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

కాగా ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం గతకొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

కార్తికేయ సీక్వెల్‌కు దండం పెట్టిన మలయాళ బ్యూటీ-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా కథను దర్శకుడు చందూ ముండేటి తనకు చెప్పినప్పుడు అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా కథపట్ల పెద్దగా ఆసక్తి చూపలేదట.ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని భావించిన ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.

మొత్తానికి ఓ క్రేజీ సీక్వెల్‌లో నటించే ఆఫర్‌ను అనుపమ ఈ విధంగా రిజెక్ట్ చేయడంతో, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం మళ్లీ ఆసక్తికరంగా మారింది.నిఖిల్ సరసన ఈ సినిమాలో నటించే ఆ లక్కీ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారా అని టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు