''18 పేజెస్'' లో అదరహో అనిపిస్తున్న అనుపమ లుక్!

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న సినిమాల్లో ‘18 పేజెస్‘ ఒకటి.ఈ సినిమాను కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్నాడు.

 Anupama Parameswaran First Look From 18 Pages Movie Reveal, 18 Pages Movie, Anup-TeluguStop.com

ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సుకుమార్ అందిస్తున్నాడు.

ఈ సినిమాలో నిఖిల్ కు జంటగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది.ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుండి అనుపమ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సినిమాలో అనుపమ నందిని అనే పాత్రలో నటిస్తున్నట్టు ఈ మోషన్ పోస్టర్ లో తెలిపారు.ఈమె లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.అడవిలో ప్రకృతిని ఆస్వాదిస్తు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న అనుపమ చేతి మీద ఒక సీతాకోక చిలుక వాలినట్లు ఫస్ట్ లుక్ ద్వారా చిత్ర యూనిట్ చూపించింది.ఈ వీడియో విజువల్ గా కూడా చాలా అందంగా చూడడానికి ఆకర్షణీయంగా ఉంది.

ఇక ఈ సినిమాలో నిఖిల్ సిద్ధు అనే పాత్రలో నటిస్తున్నాడు.టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా ఇక అనుపమ లుక్ రివీల్ చేసి మరింత ఆకట్టుకుంది.ఇప్పటికే సిద్దు ఫస్ట్ లుక్ కూడా విడుదల అవ్వగా అది కూడా బాగా ఆకట్టుకుంది.ఇక సుకుమార్ కథను అందిస్తుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇక నిఖిల్ ఈ సినిమాతో పాటు కార్తీకేయ2 సినిమా కూడా చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube