అసలు అనుమప పరమేశ్వరన్... బూమ్రా మద్యం ఏం జరిగింది!  

బూమ్రాకి తనకి మద్యం ఉన్నది స్నేహం మాత్రమే అంటున్న అనుపమ పరమేశ్వరన్. .

Anupama Parameswaran Fires On Media About Relationship With Bumra-cricket World Cup,relationship With Bumra,telugu Cinema,tollywood

టాలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న నటి అనుపమ పరమేశ్వరన్. అందంతో పాటు అభినయం కూడా ఉన్న ఈ నాటికీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. దీంతో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు ఇంచుమించు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి..

అసలు అనుమప పరమేశ్వరన్... బూమ్రా మద్యం ఏం జరిగింది!-Anupama Parameswaran Fires On Media About Relationship With Bumra

ప్రస్తుతం రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇక మలయాళీలో కూడా ఈ భామ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో హీరోయిన్ ప్లేస్ నుంచి అసిస్టెంట్ దర్శకురాలిగా మారిపోయి త్వరలో మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అయిపోతుంది.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా టీం ఇండియా క్రికెటర్ బుమ్రా, అనుపమ పరమేశ్వరన్ మద్య ఏదో అంతకు మించి రిలేషన్ ఉందని, ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ ఓ ఆంగ్ల మీడియా సంచలన కథనం రాసింది. దీంతో ఇప్పుడు ఇద్దరికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి కారణం సోషల్ మీడియాలో బూమ్రా ఫాలో అవుతున్న ఒకే ఒక్క సినీ నటి అనుపమ పరమేశ్వరన్ కావడంతో బూమ్రా అనుపమకి కనెక్ట్ అయిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ గాసిప్స్ అని అనుపమ తాజాగా స్పందిస్తూ తమ ఇద్దరి మధ్య స్నేహం తప్ప అంతకు మించి అందరూ అనుకుంటున్నట్లు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసి తన ఇమేజ్ డిస్టర్బ్ చేయొద్దని కూడా ఆమె కామెంట్స్ చేసారు.