అనుపమ కి అక్కడ నుంచి ఆఫర్లు..!

కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్న మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి లక్కీ ఛాన్సులు వస్తున్నట్టు తెలుస్తుంది.నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన కార్తికేయ 2 సినిమాలో అనుపమ తన నటనతో అదరగొట్టేసింది.

 Anupama Parameswaran Bollywood Chances , Anupama, Anupama Parameswaran, Chandu M-TeluguStop.com

ఈ సినిమా తెలుగులోనే కాదు హిందీలో కూడా అద్భుతాలు సృష్టిస్తుంది.కార్తికేయ 2లో అనుపమ నటన చూసి బాలీవుడ్ మేకర్స్ ఫిదా అయ్యారట.

అందుకే ఆమెకి అక్కడ నుంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌజ్ నుంచి అనుపమకి ఆఫర్ వచ్చిందట.

ఫ్యాన్సీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.ఇన్నాళ్లుగా తెలుగులో సినిమాలు చేస్తున్నా కార్తికేయ 2 తో అనుపమకి మంచి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమాతో ఆమె బాలీవుడ్ లో సూపర్ పాపులర్ అవుతుంది.నిఖిల్ కూడా బాలీవుడ్ లో తన మార్కెట్ పెంచుకుంటున్నాడని చెప్పొచ్చు.

కార్తికేయ 2 తెలుగులో ఆల్రెడీ లాభాల్లోకి రాగా. హిందీలో మాత్రం రికార్డ్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది.

 హడావిడి చూస్తుంటే కార్తికేయ 2 బాలీవుడ్ లో ఫ్యాన్సీ కలక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. అక్కడ వచ్చిన రెస్పాన్స్ ని చూసి కార్తికేయ 2 టీం ముంబై, ఢిల్లీల్లో ప్రమోషన్స్ చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube