ప్రేమమ్ కంటే ముందు అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి షార్ట్ ఫిలిం లో ఆక్ట్ చేసిందో చూస్తే షాక్ అవుతారు!       2018-06-19   03:53:59  IST  Raghu V

“అగరొత్తులు కురులే వలాగా విసిరేసింది…ప్రేమని పరిచయం చేసింది” ప్రేమమ్ సినిమాతో కుర్రాళ్ళ హృదయాలు దోచేసుకుంది. తరవాత “అ ఆ” సినిమాతో ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన “శతమానం భవతి” తో టాప్ హీరోయిన్ కేటగిరీలో చేరిపోయింది అనుపమ. ప్రేమమ్ లో “నాగ చైతన్య” స్కూల్ అమ్మాయిల ఎంతో ముద్దుగా ఆక్ట్ చేసింది అనుపమ పరమేశ్వరన్. నాగ చైతన్యతో పాటు సినిమా చూసే అబ్బాయిలు కూడా “అనుపమ” తో లవ్ లో పడిపోయారు అనడంలో ఆశ్చర్యం ఏం లేదు. తరవాత మలయాళం, తమిళ్ లో బాగానే హిట్లు సంపాదించేసుకుంది ఈ కేరళ కుట్టి.

“ప్రేమమ్” లో ఎంతో అమాయకంగా, ముద్దుగా కనిపించిన “అనుపమ”..ప్రేమమ్ కంటే ముందు ఒక షార్ట్ ఫిలిం లో చేసింది. ఆ షార్ట్ ఫిలింలో ఒక స్కూల్ అమ్మాయిలా ఆక్ట్ చేసింది. స్కూల్ ఫంక్షన్ లో ఓ మెజీషియన్ మేజిక్ చేస్తుంటే, బొమ్మలతో కాదు మనుషులతో మేజిక్ చెయ్యి అని ఎగతాళి చేస్తుంది. అప్పుడు అనుపమను స్టేజి మీదకి పిలిచి, ఒక టేబుల్ మీద పడుకోపెట్టి పెద్ద కత్తితో సగానికి కట్ చేస్తాడు!