మాతృభాషలో ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన అనుపమ

అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో అందరిని తన వైపు తిప్పుకున్న నటి అనుపమ పరమేశ్వరన్.ఈ అమ్మడు స్వతహాగా మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది.

 Anupama Parameswaran On Why She Signs Less Malayalam, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

అయితే ఆమె చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకొకపోవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది.అయితే దీంతో అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందుకోవడానికి ఇబ్బంది పడుతుంది.

అయితే అడపాదడపా సినిమాలు మాత్రం అనుమప తెలుగులో చేస్తూనే ఉంది.తాజాగా గీతా ఆర్ట్స్ లో సుకుమార్ కథతో నిఖిల్ హీరోగా తెరకెక్కబోయే 18 రోజెస్ మూవీలో అనుపమ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు ప్రేమమ్ అనే మలయాళీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన, ఆ సినిమా సూపర్ సక్సెస్ ఇచ్చిన తరువాత మాతృభాషలో ఎక్కువ సినిమాలు చేయలేదు.ఇప్పటి వరకు అక్కడ కేవలం ఊడు సినిమాలు చేసింది.

అందులో మొదటి రెండు సినిమాలు క్యామియో రోల్స్ మాత్రమే.

అయితే తాను మాతృభాషలో ఎందుకు ఎక్కువగా చేయడం లేదన్నది అనుపమ తాజాగా వివరించింది.

ప్రేమమ్ విడుదలైనప్పుడు నేను చాలా చిన్న పిల్లని.అప్పుడు నాకసలు ఏమీ తెలియదు.

ఎవరో తెలిసిన వాళ్లు చెబితే, ప్రమోషన్స్ సమయంలో మీడియాలో ఇంటర్వ్యూలు ఎక్కువగా ఇచ్చేశాను.దానికి తోడు, చిన్నపిల్లని కదా, సమాధానాలు కూడా ఏవేవో చెప్పేశాను.

తీరా చూస్తే ప్రేమమ్ సినిమాలో నాది చిన్న క్యారెక్టర్.దాంతో అందరూ నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు.

ఇంటర్వ్యూలలో చాలా బిల్డప్ ఇచ్చానంటూ ట్రోల్ చేశారు.ఆ మాటలకి బాగా అప్సెట్ అయ్యాను.

దాంతో మలయాళం సినిమాలకు దూరంగా వుండాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.వచ్చిన సినిమాలను తిరస్కరించాను.

ఇతర భాషలపై దృష్టి పెట్టానని అనుపమ చెప్పుకొచ్చింది.ఇతర బాషలలో సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న అది త్వరలో రిలీజ్ అవుతుంది అని అనుపమ స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube