అనుపమకు చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్.. చివరకు..?

మలయాళంలో ప్రేమమ్ సినిమాతో, తెలుగులో ప్రేమమ్ సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో గుర్తింపును సంపాదించుకున్నారు అనుపమ పరమేశ్వరన్.ప్రతిభ పుష్కలంగా ఉన్న ఈ హీరోయిన్ కు రంగస్థలం సినిమాలో మొదట హీరోయిన్ ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో సమంత ఎంపికయ్యారు.

 Anupama Parameshwaran Says Pawan Kalyan Breaks Barriers With Vakeel Saab-TeluguStop.com

ఆ సినిమాలో నటించి ఉంటే మాత్రం అనుపమకు స్టార్ హీరోయిన్ గుర్తింపు దక్కేది.

లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో ఇంటికే పరిమితమైన అనుపమ వకీల్ సాబ్ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో వీక్షించారు.

 Anupama Parameshwaran Says Pawan Kalyan Breaks Barriers With Vakeel Saab-అనుపమకు చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్.. చివరకు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో తెరకెక్కి 85 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించిన వకీల్ సాబ్ స్ట్రాంగ్ మెసేజ్ తో పవర్ ఫుల్ పర్ఫామెన్స్ తో తనను ఆకట్టుకుందని అనుపమ వెల్లడించారు.సినిమాలో అన్యాయానికి గురైన నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్లకు పవన్ కళ్యాణ్ అండగా నిలబడిన తీరు బాగుందని అనుపమ పరమేశ్వరన్ పేర్కొన్నారు.

సినిమాలో ప్రకాష్ రాజ్ నటించకపోయి ఉంటే అసంపూర్తిగా ఉండేదని ఆమె వెల్లడించారు.అయితే పవన్ కళ్యాణ్ నటన గురించి అనుపమ ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడంతో పవన్ ఫ్యాన్స్ అనుపమకు చుక్కలు చూపించారు.పవన్ ఫ్యాన్స్ ను కూల్ చేయడానికి అనుపమ పవన్ అంటే తనకు ఎంతో ప్రేమ, గౌరవం అని తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకపోవడం గురించి ఆమె పవన్ ఫ్యాన్స్ కు క్షమాపణలు తెలిపారు.

మరోవైపు వకీల్ సాబ్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో భారీగా వ్యూస్ సాధిస్తోందని తెలుస్తోంది.థియేటర్లలో రిలీజైన కొన్ని రోజులకే ఓటీటీలో విడుదలైన సినిమా కావడంతో ఈ సినిమా ఓటీటీ వ్యూస్ పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోందని తెలుస్తోంది.

వకీల్ సాబ్ ఓటీటీ హక్కులు 25 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

#Pawan Kalyan #Amazon Prime #Vakeel Saab #BarriersWith #Prakash Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు