ఆ ఇష్యూను మరిచిపోని అనుపమ.. మూతి ముడుచుకుని..?

యంగ్ హీరోయిన్లు, మిడిల్ రేంజ్ హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం వస్తే ఎంతో సంతోషిస్తారనే సంగతి తెలిసిందే.స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే పేరు, గుర్తింపు రావడంతో పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కుతుంది.

 Anupama Parameshwaran Did Not Respond Much To The Movie With Charan-TeluguStop.com

స్టార్ హీరోతో నటించే సినిమా హిట్టైతే రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.అయితే కొన్ని సందర్భాల్లో యంగ్, మిడిల్ రేంజ్ హీరోయిన్లను ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అవుతూ ఉంటుంది.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సమంత నటించారు.

 Anupama Parameshwaran Did Not Respond Much To The Movie With Charan-ఆ ఇష్యూను మరిచిపోని అనుపమ.. మూతి ముడుచుకుని..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మొదట అనుపమ పరమేశ్వరన్ కు రాగా కొన్ని కారణాల వల్ల అనుపమ ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.ఆ సినిమా తరువాత అనుపమ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

తాజాగా సోషల్ మీడియాలో లైవ్ చాట్ చేసిన అనుపమ పరమేశ్వరన్ కు ఒక నెటిజన్ రామ్ చరణ్ అనుపమ కాంబినేషన్ ను చూడవచ్చా.? అని ప్రశ్నించారు.అప్పటివరకు సరదాగా చాట్ చేసిన అనుపమ ఆ ప్రశ్న ఎదురు కాగానే మూతి ముడుచుకోవడం గమనార్హం.రంగస్థలం ఇష్యూని అనుపమ పరమేశ్వరన్ ఇంకా మరిచిపోలేదని తెలుస్తోంది.ప్రస్తుతం 18 పేజెస్ సినిమా అనుపమ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా రిజల్ట్ పైనే అనుపమ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

18 పేజెస్ హిట్టైతే అనుపమకు హీరోయిన్ గా మళ్లీ వరుస ఆఫర్లు వస్తాయి.ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అనుపమకు కొత్త ఆఫర్లు రావడం కష్టైమేనని చెప్పవచ్చు.

అనుపమ గత సినిమా రాక్షసుడు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన సంగతి తెలిసిందే.

#Ram Charan #Rangasthalam #Did Not Respond #18 Pages #18Pages

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు