ఆ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్న అనుపమ  

Anupama Not Interested To Act In Bold Characters - Telugu, Kollywood, South Cinema, Tollywood

ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ అనుపమ పరమేశ్వరన్.ఈ భామ తెలుగు అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

 Anupama Not Interested To Act In Bold Characters - Telugu, Kollywood, South Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తెలుగులో వరుస అవకాశాలు సొంతం చేసుకుంది.అయితే అందం, ఆకర్షణతో పాటు నటిగా ప్రూవ్ చేసుకున్న కూడా అవకాశాలు పెద్దగా రావడం లేదు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు హీరోగా తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తుంది.అదే సమయంలో దిల్ రాజు మేనల్లుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీలో అనుపమని ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఆ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్న అనుపమ - Anupama Not Interested To Act In Bold Characters - Telugu, Kollywood, South Cinema, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు దర్శకురాలిగా మారడానికి ఫ్లాట్ ఫాం సిద్ధం చేసుకుంటున్న అనుపమ అందుకు తగ్గ ట్రైనింగ్ తీసుకుంటుంది.

సినిమా విషయంలో మల్టీ టాలెంట్ చూపించే అనుపమకి ఈ మధ్య టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా కూడా అన్ని కూడా గ్లామర్, అందాలు ఆరబోయే పాత్రలే వస్తున్నాయట.

దీంతో మొదటి నుంచి చాలా పద్దతిన పాత్రలకే పరిమితం అయిన అమ్మడు అలాంటి క్యారెక్టర్ లతో వచ్చే దర్శకులకి మొహం మీదనే తాను చేయనని చెప్పెస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.సినిమాలు లేకపోతే ఖాళీగా ఉంటాను కాని అందాల ప్రదర్శన తన వళ్ళ కాదని, అందాల ప్రదర్శన చేయలేక రంగస్థలం మూవీనే వదులుకున్న మీ సినిమాలు నాకు లెక్క కాదు అని చెప్పి వెనక్కి పంపెస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

అసలు ఎక్స్ పోజింగ్ విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యి చేయాల్సిన అవసరం తనకి లేదని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.

తాజా వార్తలు

Anupama Not Interested To Act In Bold Characters Related Telugu News,Photos/Pics,Images..