అనుపమకు త్రివిక్రమ్ సినిమాలో ఆఫర్?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాగా.

 Anupama Will Act In Trivikram New Movie, Ram, Poninen, Trivikram, Cinema, Heroin-TeluguStop.com

ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది.అలాగే త్రివిక్రమ్-రామ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనే దానిపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.రూ.40 కోట్ల లోపు ఖర్చుతో ఈ సినిమాను పూర్తి చేయాలని త్రివిక్రమ్ టార్గెట్ పెట్టుకున్నాడట

అయితే ప్రస్తుతం ఈ సినిమాలో నటించేందుకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.ఈ క్రమంలో రామ్ సరసన హీరోయిన్ ఎవరనేది ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో రామ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.మలయాళ ముద్దుగుమ్మ అయిన ఆమెను త్రివిక్రమ్‌నే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు

ఇటీవల అనుపమ పరమేశ్వరన్ బరువు తగ్గి వార్తల్లో నిలిచింది.ఈ క్రమంలో రామ్‌తో తాను చేయబోయే సినిమాలో అనుపమకు ఆఫర్ ఇవ్వాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే నటిగా అనుపమ మంచి పేరు సంపాదించుకుంది.తనదైన నటనతో అభిమానులను సంపాదించుకుంది.

అగ్రహీరోయిన్లతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ హైదరాబాద్‌లోనే ఈ ముద్దుగుమ్మ సెటిల్ అయిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube