అమ్మ‌ను కోల్పోయినా ఆవిడ ఆశ‌యాన్ని నెర‌వేర్చాడు ఆ కొడుకు. రియ‌ల్ స్టోరీ..!  

Anupam Panwar Real Story-

 • రాజ‌స్థాన్‌లోని శ్రీ‌గంగాన‌గ‌ర్ మా సొంత ఊరు. అక్క‌డే నేను పుట్టా.

 • అమ్మ‌ను కోల్పోయినా ఆవిడ ఆశ‌యాన్ని నెర‌వేర్చాడు ఆ కొడుకు. రియ‌ల్ స్టోరీ..!-Anupam Panwar Real Story

 • చిన్న‌ప్ప‌టి నుంచి న‌న్ను పెంచ‌డం, చ‌దివించ‌డం కోసం మా అమ్మ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డింది. ఆమె ప‌డిన క‌ష్టాన్ని మాట‌ల్లో చెప్పలేను.

 • నేను ఐఐటీ చ‌దివి గొప్ప ఉద్యోగంలో స్థిర ప‌డాల‌నేది ఆమె కోరిక‌. అందులో భాగంగానే నేను క‌ష్ట‌ప‌డి చ‌దివా.

 • ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించా. అయితే అనుకోకుండా అక్క‌డ మొద‌టి సంవ‌త్స‌రం మొద‌టి సెమిస్ట‌ర్‌లో నాకు 10కి కేవ‌లం 4.7 ఎస్‌జీపీఏ మాత్రమే వ‌చ్చింది. దీంతో నాకు E గ్రేడ్ ఇచ్చారు.

 • Anupam Panwar Real Story-

  అలా E గ్రేడ్ వ‌చ్చాక న‌న్ను డిసిప్లిన‌రీ క‌మిటీ ముందు నిల‌బెట్టారు. వారు త‌రువాతి సెమిస్ట‌ర్‌లో నాకు 20 క్రెడిట్స్ టార్గెట్ పెట్టారు. అయితే అనుకోకుండా రెండో సెమిస్ట‌ర్‌లోనూ నాకు కేవ‌లం 5.5 ఎస్‌జీపీఏ మాత్రమే వ‌చ్చింది. మ‌ళ్లీ E గ్రేడ్ ఇచ్చారు. దీంతో నేను తీవ్ర‌మైన డిప్రెష‌న్‌కు లోన‌య్యా.

 • మ‌రో వైపు అప్పుడే మా అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమెను ర‌క్షించుకోవాల‌ని బాగా ప్ర‌య‌త్నం చేశాం.

 • అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ అమ్మ న‌న్ను విడిచిపెట్టి కాన‌రాని లోకానికి వెళ్లిపోయింది. దీంతో ఆ సంఘ‌ట‌న న‌న్న మ‌రింత కుంగ‌దీసింది.

 • తిరిగి కాలేజీకి వ‌చ్చా. నాకు ఏం చేయాలో తోచ‌లేదు.

 • ఓ వైపు అమ్మ మ‌ర‌ణం. మ‌రో వైపు నాకు వ‌స్తున్న E గ్రేడ్లు.

 • చూసి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే అమ్మ న‌న్ను కోరిన కోరిక ఒక్క‌టే.

 • చ‌దువుల్లో బాగా రాణించి ఉన్న‌త స్థానంలో ఉద్యోగం చేయాల‌ని. అదే నా మ‌న‌స్సులోకి వ‌చ్చింది.

 • ఇక ఆగ‌లేదు. వెంట‌నే నా ప‌ని ప్రారంభించా.

 • చాలా సీరియ‌స్‌గా చ‌దువుల‌పై దృష్టి సారించా. దీంతో ప్ర‌తి సెమిస్ట‌ర్ లోనూ నాకు 9.8 ఎస్‌జీపీఏ వ‌చ్చింది. ఓవ‌రాల్‌గా 7.1 జీపీఏ సాధించి మంచి పొజిషన్‌లో బీటెక్ పాస‌య్యా. ఇప్పుడు అమెరికాలో జాబ్ చేస్తున్నా.

 • ఉన్న‌త స్థానంలో ఉన్నా. ఇదే క‌దా అమ్మ కోరుకుంది.

 • ఆమె అనుకుంది నెర‌వేర్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అమ్మ‌ మా మ‌ధ్య లేక‌పోయినా నాతో ఎప్పుడూ అమ్మ నా వెన్నంటి ఉంటుంద‌ని న‌మ్ముతున్నా.

 • !— అనుప‌మ్ ప‌న్వార్ అనే వ్య‌క్తికి సంబంధించిన య‌దార్థ గాథే ఇది. రియ‌ల్ స్టోరీ.

 • !