ఇది కూడా కొడితే అతనికి తిరుగు ఉండదు..!

టాలెంట్ ఉండాలే కాని చేసిన ఒక్క సినిమాకే సూపర్ క్రేజ్ తెచ్చుకునే దర్శకులు చాలామంది ఉన్నారు.అలాంటి వారిలో ఖచ్చితంగా జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ కెవి అని చెప్పొచ్చు.

 Anudeep Kv Shiva Karthikeyan Prince Movie , Anudeep Kv , Prince , Prince Movie-TeluguStop.com

అతను తీసిన సినిమానే కాదు అతనితో చేసిన ఇంటర్వ్యూస్ కూడా ఆడియెన్స్ ని అలరించాయంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ తన నెక్స్ట్ సినిమా ఏకంగా బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు.

శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అంటూ తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తున్నాడు అనుదీప్ కెవి.

ఈ సినిమాను దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

వరుస హిట్లతో దూసుకెళ్తున్న శివ కార్తికేయన్ కు అనుదీప్ కెవితో కలిసి సినిమా చేయడం ఆడియెన్స్ ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా కూడా జాతిరత్నాలు మార్క్ చూపిస్తే మాత్రం డైరక్టర్ అనుదీప్ స్టార్ డైరక్టర్ గా మరో మెట్టు ఎక్కినట్టే అని చెప్పొచ్చు.

ప్రిన్స్ హిట్ పడితే శివ కార్తికేయన్ కు తెలుగులో మరింత మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది.ఈ సినిమాలో సత్యరాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube