మూడు కథలతో సిద్ధంగా ఉన్న జాతి రత్నాలు దర్శకుడు

జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా స్టార్ దర్శకుడుగా మారిపోయిన వ్యక్తి అనుదీప్ కీవీ.ఈ సినిమా కంటే ముందుగా పిట్టగోడ అనే సినిమా చేశాడు.

 Anudeep Kv Ready To Three Stories For His Next Movie-TeluguStop.com

ఈ సినిమా కూడా పెద్ద బ్యానర్ లోనే చేసిన కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.అయితే జాతిరత్నాలు సినిమా మాత్రం ఈ కుర్ర దర్శకుడు ఇమేజ్ ని అమాతం పెంచేసింది.

అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరపై సినిమాని ఆవిష్కరించిన అనుదీప్ కి సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.చాలా కాలం తర్వాత మనస్పూర్తిగా థియేటర్ లో కూర్చొని నవ్వుకున్నామని సినిమా చూసిన అందరూ పొగడ్తలతో ముంచేశారు.

 Anudeep Kv Ready To Three Stories For His Next Movie-మూడు కథలతో సిద్ధంగా ఉన్న జాతి రత్నాలు దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా నిర్మాత నాగ్ అశ్విన్ కి భారీగా డబ్బులు తీసుకొచ్చి పెట్టింది.ఇక నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఈ సినిమా కారణంగా ప్రస్తుతం అతని చేతిలో ఓ మూడు సినిమాల వరకు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇక దర్శకుడు అనుదీప్ కి కూడా నిర్మాతల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.

అయితే అనుదీప్ మాత్రం తన నెక్స్ట్ సినిమాని కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర దర్శకుడు మూడు కథలని రెడీ చేసుకొని నాగ్ అశ్విన్ కి వినిపించినట్లు తెలుస్తుంది.

అందులో జాతిరత్నాలు తరహాలోనే అవుట్ అండ్ అవుట్ కామెడీ సబ్జెక్ట్ ఒకటి కాగా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది.అలాగే మరో లవ్ స్టొరీని కూడా సిద్ధం చేసి వినిపించాడని సమాచారం.

దాంతో పాటు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ కూడా ఒకటి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.ఈ మూడింటికిలో నాగ్ అశ్విన్ నిర్ణయం బట్టి ఒకటి ఫైనల్ చేసుకొని పట్టాలెక్కించే పనిలో అనుదీప్ ఉన్నట్లు సమాచారం.

#Nag Ashwin #JathiRathnalu #Anudeep KV

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు