ఆ బ్యూటీతో మాస్ రాజా రొమాన్స్..?  

Anu Emmanuelle In Raviteja Next Movie, Anu Emmanuelle, Raviteja, Nakkina Trinadha Rao, Tollywood News - Telugu Anu Emmanuelle, Nakkina Trinadha Rao, Raviteja, Tollywood News

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ క్రాక్ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు.

TeluguStop.com - Anu Emmanuelle In Raviteja Next Movie

దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఖిలాడి చిత్రంలో రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

కాగా ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్న సంగతి చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - ఆ బ్యూటీతో మాస్ రాజా రొమాన్స్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా తరువాత రవితేజ తన నెక్ట్స్ చిత్రాన్ని నక్కిన త్రినాథ రావు డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను రవితేజ ఇటీవల ప్రకటించాడు.

కాగా ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశంపై తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ లీడ్ హీరోయిన్ పాత్రలో నటించనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే వరుస ఫెయిల్యూర్ చిత్రాల్లో నటించి ఫేడవుట్ అవుతున్న అను ఇమ్మాన్యుయెల్‌ను రవితేజ సినిమాలో హీరోయిన్‌గా ఎందుకు తీసుకోవాలని చూస్తున్నారో ప్రేక్షకులకు మాత్రం అర్థం కావడం లేదట.ఏదేమైనా తమ అభిమాన హీరో నటించబోయే సినిమాలో అను ఇమ్మాన్యుయెల్‌లను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనను చిత్ర యూనిట్ మానుకోవాలని రవితేజ ఫ్యాన్స్ భావిస్తున్నారట.

మరి నిజంగానే ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్‌ను హీరోయిన్‌గా తీసుకుంటారా, లేక ఇదంతా కేవలం పుకార్లేనా అనే విషయం తెలియాలంటే సినిమా యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

#Raviteja #NakkinaTrinadha #Anu Emmanuelle

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు