ఆ బ్యూటీ దెబ్బతో అన్నకు ఫ్లాప్.. మరి తమ్ముడికి?

నాని నటించిన మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ అను ఇమ్మాన్యుయెల్, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది.అయితే సినిమాల ఎంపికలో అమ్మడు బొక్కబోర్లా పడటంతో ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మిగిలాయి.

 Anu Emmanuel To Romance Allu Sirish-TeluguStop.com

దీంతో అమ్మడి కెరీర్ ప్రస్తుతం ఫేడవుట్ అయ్యే స్టేజీలో ఉంది.ఇప్పటికే తెలుగు సినిమా ఛాన్సులు లేక ఆమె కాలం వెల్లదీస్తోంది.

అయితే గతంలో ఆమె అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమాలో నటించి మెప్పించింది.కాగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.

 Anu Emmanuel To Romance Allu Sirish-ఆ బ్యూటీ దెబ్బతో అన్నకు ఫ్లాప్.. మరి తమ్ముడికి-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీ నుండి ఆమెకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.అల్లు శిరీష్ ప్రస్తుతం హీరోగా తెరకెక్కించబోయే ఓ సినిమాలో అను హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

మొత్తానికి చేతిలో సినిమాలే లేని బ్యూటీకి ఇప్పుడు ఒక అవకాశం రావడంతో ఆమె సంతోషంగా ఉందని తెలుస్తోంది.

రాకేష్ శశి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో అల్లు శిరీష్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాతోనైనా అనుకు సక్సెస్ అందుతుందో లేదో చూడాలి.బన్నీకి ఫ్లాప్ అంటగట్టిన ఈ బ్యూటీ తమ్ముడికి ఎలాంటి సినిమాను ఇస్తుందో చూడాలి.

#Naa Peru Surya #Anu Emmanuel #Allu Sirish #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు