మహా సముద్రంలో శర్వానంద్ కోసం అనూ ఇమ్మాన్యూయేల్

టాలీవుడ్ ఈ మధ్య కాలంలో మోస్ట్ అన్ లక్కీ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే అనూ ఇమ్మాన్యూయేల్ పేరు చాలా మంది చెబుతారు.మజ్ను సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ తక్కువ సమయంలో స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశం సొంతం చేసుకుంది.

 Anu Emmanuel To Pair Up With Sharwanand-TeluguStop.com

ఆక్సిజన్, నా పేరు సూర్య, అజ్ఞాతవాసి, డిటెక్టివ్ సినిమాలతో వరుసగా స్టార్ హీరోలతో జత కట్టే అవకాశం సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమాలలో డిటెక్టివ్ తప్ప మిగిలిన సినిమాలలో కేవలం గ్లామర్ షోకి, సాంగ్స్ కి మాత్రమే పరిమితమయ్యే పాత్రలు చేసింది.

థియేటర్ లో ఈ సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆ ప్రభావం అనూ మీద పడింది.పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకి జోడీగా నటించింది అని చెప్పుకోవడానికి తప్ప కెరియర్ పరంగా పెద్దగా ప్రయోజనం లేదు సరికదా.

 Anu Emmanuel To Pair Up With Sharwanand-మహా సముద్రంలో శర్వానంద్ కోసం అనూ ఇమ్మాన్యూయేల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వచ్చే అవకాశాలు కూడా రాకుండా చేసింది.

చివరిగా ఆమె తెలుగులో శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

అయితే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలో ఒక హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యూయేల్ చేస్తుంది.అయితే ఈ అమ్మడుకి మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.

ప్రస్తుతం రవితేజ సినిమా కోసం అనూ పేరుని పరిశీలిస్తూ ఉండగా అజయ్ భూపతి మహా సముద్రం సినిమాలో శర్వానంద్ కి జోడీగా అనూ ఇమ్మాన్యూయేల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది.

గ్లామర్ షోకి ఏ మాత్రం అభ్యంతరం చెప్పని అనూ సరైన బ్రేక్ పడితే మాత్రం టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ అయిపోవడం గ్యారెంటీ అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.

#Sharwanand #Anu Emmanuel #South Heroines #Ajay Bhupati #@ItsAnuEmmanuel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు