ఎన్ని వగలు పోయిన ఐరన్ లెగ్ ముద్ర దూరం అయితేనే అనూ పాపకి అవకాశాలు

చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో కెరియర్ ప్రారంభించి తరువాత హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన మల్లు బ్యూటీ అనూ ఇమ్మాన్యూయేల్.ఈ అమ్మడు మజ్ఞు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

 Anu Emmanuel Skin Show Photo Shoot Viral-TeluguStop.com

మొదటి సినిమా హిట్ కావడంతో పాటు గ్లామర్ పాత్రలకి కూడా ఒకే చెప్పడంతో చాలా వేగంగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చింది.తెలుగులో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ నా పేరు సూర్య, కోలీవుడ్ లో విశాల్ కి జోడీగా డిటెక్టివ్, ఆక్సిజన్, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలలో నటించింది.

అయితే ఈ సినిమాలో ఏ ఒక్కటి అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.దీంతో అనూపై టాలీవుడ్ లో ఇప్పటికే ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది.

 Anu Emmanuel Skin Show Photo Shoot Viral-ఎన్ని వగలు పోయిన ఐరన్ లెగ్ ముద్ర దూరం అయితేనే అనూ పాపకి అవకాశాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో రమ్యకృష్ణ, శృతి హసన్ లాంటి స్టార్ హీరోయిన్స్ మీద కూడా ఇలాంటి ముద్రనే పడింది.తరువాత సక్సెస్ లు అందుకొని వరుస సినిమాలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.

ఇక అనూ ఇమ్మాన్యూయేల్ తన హాట్ ఫోటో షూట్ లతో సందడి చేస్తుంది.గ్లామర్ రోల్స్ కి నేను రెడీ అంటూ పదే పదే హింట్ ఇస్తుంది.

అయినా కూడా ఆమెతో సినిమా అంటే ఫ్లాప్ అనే ఫీలింగ్ తో చాలా మంది దర్శక, నిర్మాతలు అనూని సంప్రదించడం లేదని తెలుస్తుంది.తెలుగులో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయితే ఇక మిగిలిన బాషలలో కూడా జెండా పాతోచ్చని అనూ భావిస్తుంది.

అయితే వరుస ఫ్లాప్ ల కారణంగా ఈ బ్యూటీకి ఆ అవకాశం రావడం లేదు.రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన అల్లుడు అదుర్స్ సినిమా కూడా ఆమె ఖాతాలో మరో డిజాస్టర్ మూవీగా మారిపోయింది.

ప్రస్తుతం అజయ్ భూపతి మహా సముద్రం మాత్రమే ఈమె చేతిలో ఉంది.రీసెంట్ గా ఈ బ్యూటీ థైస్ అందాలు కనిపించే విధంగా హాట్ ఫోటోషూట్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

అయితే ఎన్ని చేసిన అవకాశాలు రావాలంటే సక్సెస్ మంత్రం ఒకటే సాధ్యమని, మహా సముద్రంతో అయినా ఈ అమ్మడు ఫేట్ మారుతుందేమో చూడాలని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు.

#Mallu Beauties #Anu Emmanuel #MahaSamudram #South Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు