అను ఇమ్మాన్యుయేల్ కేరీర్ ముగిసినట్టేనా.. అందం ఉన్నా ఈ పరిస్థితి ఏంటో!

హీరోయిన్ అను ఇమ్మానుయేల్ గురించి మనందరికీ తెలిసిందే.మొదట స్వప్న సంచారి అనే మలయాళ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ యాక్షన్ హీరో బిజు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.

 Anu Emmanuel Situation Has Become Like This, Anu Emmanuel, Tollywood, Movie Offers, Raviteja-TeluguStop.com

ఆ తర్వాత టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నటించిన మజ్ను సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో ఇచ్చింది.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అను ఇమ్మానియేల్ కు భారీగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి అజ్ఞాతవాసి అల్లు అర్జున్ నా పేరు సూర్య, గోపీచంద్ తో ఆక్సిజన్, నాగచైతన్య తో శైలజ రెడ్డి అల్లుడు వంటి సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు తగిన గుర్తింపు దక్కలేదు.

 Anu Emmanuel Situation Has Become Like This, Anu Emmanuel, Tollywood, Movie Offers, Raviteja-అను ఇమ్మాన్యుయేల్ కేరీర్ ముగిసినట్టేనా.. అందం ఉన్నా ఈ పరిస్థితి ఏంటో-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

ఇకపోతే అను ఇమ్మానుయేల్ చివరిగా అల్లుడు అదుర్స్ మహాసముద్రం లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తాపడడంతో అను ఇమ్మానుయేల్ కు ఆఫర్లు భారీగా తగ్గిపోయాయి.

అంతేకాకుండా దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోవడం లేదు.కాగా ప్రస్తుతం ఆమె అల్లు శిరీష్ కి జోడిగా ప్రేమ కాదంట అనే సినిమాలో నటిస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యి ఏడాది పూర్తి అవుతున్నా కూడా ఈ సినిమా నుంచి ఇంతవరకు ఒక అప్డేట్ కూడా రాలేదు.

దీనితో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందా లేదా ఆగిపోయిందా అన్నది కూడా తెలియడం లేదు.అదేవిధంగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన బోతున్న రావణాసుర సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే అందం అభినయం ను మించి టాలెంట్ ఉన్నప్పటికీ అను ఇమ్మానుయేల్ పరిస్థితి ఇలా మారింది ఏంటి అని అభిమానులు బాధ వ్యక్తం చేస్తున్నారు.

అయితే సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినప్పటికీ అను ఇమ్మానియేల్ మాత్రం అదైర్య పడకుండా వచ్చిన సినిమా అవకాశాలను వదులుకోకుండా సినిమాలు చేస్తూ పోతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube