మజ్ను సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ, మల్లు బ్యూటీ అనూ ఇమాన్యుయేల్ .ఈ అమ్మడు మొదటి సినిమాతోనే హీరోయిన్ గా అటు గ్లామర్ తో, ఇటు పెర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు కొట్టేసింది.
ఇక రాజ్ తరుణ్ తో కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో పర్వాలేదనిపించుకుంది.దీంతో ఊహించని విధంగా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అనూకి ఆఫర్లు వచ్చాయి.
ఏకంగా పవన్ కళ్యాణ్ కి జోడీగా అజ్ఞాతవాసి సినిమాలో నటించింది.అలాగే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాలో ఆడిపాడింది.
అలాగే విశాల్ తో డిటెక్టివ్ సినిమాలో సందడి చేసింది.అయితే స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈ అమ్మడుని అదృష్టం వరించలేదు.
దీంతో వచ్చిన అవకాశాలు అన్ని కూడా ఒక్కసారిగా దూరమైపోయాయి.అయితే కొంత గ్యాప్ తర్వాత మరల తెలుగులో వరుస అవకాశాలని ఈ అమ్మడు సొంతం చేసుకుంటుంది.
ఇప్పటికే అల్లుడు అదుర్స్ అనే సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా నటిస్తుంది.దీంతో పాటు మహా సముద్రం సినిమాలో శర్వానంద్ కి జోడీగా అవకాశం సొంతం చేసుకుంది.ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని ఈ మల్లు భామ సొంతం చేసుకున్నట్లు కనిపిస్తుంది. శ్రీనువైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ ఢీ సీక్వెల్ గా డబల్ డోస్ (ఢీ2) టైటిల్ తో సినిమా తెరకెక్కబోతుంది.
దీనికి సంబంధించి టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తుంది.అందులో ఒక హీరోయిన్ గా అనూ ఇమాన్యుయేల్ ని ఫైనల్ చేశారని సమాచారం.ఇక సెకండ్ హీరోయిన్ రోల్ కోసం ప్రగ్యా జైశ్వాల్ ని సంప్రదిస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి ఈ సినిమా ఆఫర్ తో వచ్చే ఏడాది ఏకంగా మూడు సినిమాతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.