పాపం.. అను పాపకు అల్లుడు బిస్కెట్!- Anu Emmanuel Paid Only Part Payment For Alludu Adhurs

Anu Emmanuel Paid Only Part Payment For Alludu Adhurs, Anu Emmanuel, Bellamonda Sreenivas, Alludu Adhurs, Remuneration, Tollywood News - Telugu Alludu Adhurs, Anu Emmanuel, Bellamonda Sreenivas, Remuneration, Tollywood News

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన అల్లుడు అదుర్స్ చిత్రం సంక్రాంతి బరిలో ప్రేక్షకులను మెప్పించే ప్రయంత్న చేసింది.దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటరర్‌టైనర్ మూవీలో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించగా, అందాల భామలు నభా నటేష్, అను ఇమ్మాన్యుయెల్‌లు హీరోయిన్లుగా నటించారు.

 Anu Emmanuel Paid Only Part Payment For Alludu Adhurs-TeluguStop.com

ఇక ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ నటిస్తున్న సంగతి చాలా తక్కువ మందికి తెలియడంతో ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించిందనే అంశం చాలా ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయెల్ నటించింది.

 Anu Emmanuel Paid Only Part Payment For Alludu Adhurs-పాపం.. అను పాపకు అల్లుడు బిస్కెట్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హీరోయిన్ అక్కగా, హీరో మాజీ లవర్‌గా అను ఈ సినిమాలో నటించింది.అయితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ భావిస్తూ వచ్చింది.

కానీ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన అల్లుడు అదుర్స్ చిత్రంలో ప్రేక్షకులకు కొత్తదనం కనిపించకపోవడంతో, ఈ సినిమాను వారు రిజెక్ట్ చేశారు.దీంతో ఈ సినిమా ఫ్లాప్ దిశగా వెళ్తోంది.

అయితే ఈ సినిమాలో నటించిన అను ఇమ్మాన్యుయెల్‌కు చిత్ర యూనిట్ మొండి చేయి చూపించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో నటించేందుకు అమ్మడికి రూ.75 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ఒప్పందం చేసుకుందట.కానీ ముందుగా కేవలం రూ.50 లక్షల చెక్కు మాత్రమే అందించిన చిత్ర నిర్మాతలు, ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ మొత్తం ఇమ్మని అడిగితే తమ వద్ద డబ్బులు లేవని తేల్చి చెబుతున్నారట.ఈ విషయం చిత్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో అల్లుడు అదుర్స్ చిత్ర యూనిట్‌పై అందరూ విరుచుకుపడుతున్నారు.

ఏదేమైనా ఓ ఆర్టిస్టుకు పేమెంట్ పూర్తిగా ఇచ్చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, సోనూ సూద్ నటించిన సంగతి తెలిసిందే.

#Alludu Adhurs #Anu Emmanuel #Remuneration

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు