తప్పుకుందా? పీకేశారా?  

పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి చిత్రానికి ముందు వరకు అను ఎమాన్యూల్‌ చిన్నా చితక చిత్రాల్లో మాత్రమే నటించింది. ఒక్కసారిగా పవన్‌తో ఛాన్స్‌ రావడంతో ఈ అమ్మడి క్రేజ్‌ ఆకాశానికి తాకింది. అను ఎమాన్యూల్‌ స్టార్‌ హీరోయిన్‌ అవ్వడం ఖాయం అని అంతా భావించారు...

తప్పుకుందా? పీకేశారా?-

కాని అనూహ్యంగా పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో అను ఎమాన్యూల్‌ పరిస్థితి పాతాలంకు పడి పోయింది. అయినా కూడా ఈమెకు అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది.

ఆ సినిమా కూడా ఫ్లాప్‌ అవ్వడంతో అను ఎమాన్యూల్‌ కెరీర్‌ ఇక ఖతం అని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈమె రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ రెండు సినిమాలు సక్సెస్‌ అయితే పర్వాలేదు లేదంటే ఈమె ఇక కనిపించక పోవచ్చు అని అంతా భావిస్తున్నారు.

ఈ సమయంలోనే చేస్తున్న రెండు సినిమాల్లోంచి ఒక సినిమాను వదిలేసుకున్నట్లుగా ముద్దుగుమ్ము అను ఎమాన్యూల్‌ ప్రకటించింది. ప్రస్తుతం నాగచైతన్య, మారుతిల కాంబో మూవీ ‘శైలజ రెడ్డి అల్లుడు’లో అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌ నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు ఇటీవలే రవితేజ హీరోగా ప్రారంభం అయిన అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంలో అను హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.

ఈ రెండు చిత్రాలతో బిజీగా ఉందని భావిస్తున్న తరుణంలో రవితేజ సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. తాను డేట్లు కేటాయించలేక పోతున్నట్లుగా చెప్పి తప్పుకుంది.

‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం షూటింగ్‌లో కొన్నాళ్లు పాల్గొన్న తర్వాత అను ఎమాన్యూల్‌ తప్పుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. కేవం రెండు సినిమాలు మాత్రమే చేస్తున్న అను డేట్లు సర్దుబాటు చేయలేక పోవడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు.

నాగచైతన్య మూవీ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. అయినా కూడా రవితేజ మూవీ ఎందుకు క్యాన్సల్‌ చేసుకుందో అర్థం అవ్వడం లేదని అంటున్నారు. అయితే సినీ వర్గాల ద్వారా వినిపిస్తున్న గుసగుసలను బట్టి అను ఎమాన్యూల్‌ను శ్రీనువైట్ల తొలగించినట్లుగా తెలుస్తోంది...

శ్రీనువైట్ల గత కొంత కాలంగా తీవ్రమైన డౌన్‌ఫాల్‌లో ఉన్నాడు. ఈ సమయంలో అనుకోని అవకాశంగా రవితేజతో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ అవకావాన్ని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న ఆయన ఫ్లాప్‌ హీరోయిన్‌ను తన సినిమాలో వద్దనుకుని తొలగించాడు.

తప్పించారు అంటే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో అను ఎమాన్యూల్‌ స్వయంగా తప్పుకున్నాను అంటూ ప్రకటించింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది.