అనుకి మరో అవకాశం రవితేజ రూపంలో వచ్చింది

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మరో సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించబోతున్నాడు.

 Anu Emmanuel Got A Chance In Raviteja Movie-TeluguStop.com

తాజాగా రిలీజ్ అయిన టీజర్ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో స్పష్టం చేసింది.ఇక ఈ సినిమాతో కచ్చితంగా సాలిడ్ హిట్ కొడతానని నమ్మకంతో రవితేజ ఉన్నాడు.

గోపీచంద్ కి కూడా ఇది బౌన్స్ బ్యాక్ మూవీగా ఉండబోతుంది.శృతి హాసన్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం.

 Anu Emmanuel Got A Chance In Raviteja Movie-అనుకి మరో అవకాశం రవితేజ రూపంలో వచ్చింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా కూడా రవితేజ యాంగిల్ లో ఉండే అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళంలో ఇంకా రిలీజ్ కానీ సతురంగ వెట్టై 2 రీమేక్ అనే మాట వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా అందులో ఒక పాత్రకి నిధి అగర్వాల్ ఫిక్స్ అయ్యింది.

ఇక సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం మోస్ట్ అన్ లక్కీ హీరోయిన్ గా పేరు పడ్డ అనూ ఇమాన్యూయేల్ ని ఫైనల్ చేశారు.మజ్ను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఊహించని విధంగా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం అందుకుంది.

ఏకంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో జత కట్టింది.గతంలో అమర్ అక్బర్ అంటోనీ సినిమాలో హీరోయిన్ గా ముందు అనూని ఖరారు చేశారు.

అయితే మధ్యలో ఆమెని తొలగించి ఇలియానాని తీసుకున్నారు.అప్పుడు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే అప్పుడు ఆమె లిస్టులో మరో ఫ్లాప్ పడకుండా ఆమె కెరియర్ అడ్డుపడింది.ఇప్పుడు ఆమె కెరియర్ పుంజుకోవడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని అనుకుంటుంది.

మరి అనూ లాంటి హాట్ బ్యూటీకి ఈ సినిమా కెరియర్ పరంగా ఎంత వరకు ప్లస్ అవుతుంది అనేది చూడాలి.

#Hero Raviteja #DirectorRamesh #Anu Emmanuel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు