నీకు ఇంత బలుపు ఎందుకు అమ్మడు?  

Anu Emmanuel Disrespects Andrea On Sets-anu Emmanuel,director Mysskin,thupparivaalan

చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉండి హీరోయిన్‌కు ఉండాల్సిన లక్షణాలు అన్ని కూడా ఉన్నాయి అన్నట్లుగా ఉండే ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్‌.అదృష్టం కొద్ది ఈమెకు పవన్‌ కళ్యాణ్‌.అల్లు అర్జున్‌ వంటి స్టార్స్‌తో నటించే అవకాశం దక్కింది.కాని అవి వర్కౌట్‌ అవ్వలేదు.తెలుగులో చాలా ప్రయత్నాలు చేసి విసిగి పోయిన ఈ అమ్మడు తమిళంలో ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తుంది.తెలుగులో ఆఫర్లే లేవు.తమిళంలో చాలా తక్కువ క్రేజ్‌తో ఈ అమ్మడు నెట్టుకు వస్తుంది.
కెరీర్‌లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా కూడా ఈ అమ్మడు పొగరు బలుపుకు మాత్రం ఏమాత్రం తక్కువ లేదు.

Anu Emmanuel Disrespects Andrea On Sets-Anu Director Mysskin Thupparivaalan

ఈమె చేస్తున్న పనుల కారణంగా ఇండస్ట్రీలో ఈమెకు చెడ్డ పేరు వస్తుంది.తాజాగా తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు సీనియర్‌ నటి అయిన ఆండ్రీయాతో దురుసుగా ప్రవర్తించిందట.

తన డ్రస్‌ను పట్టుకోవాలంటూ తోటి నటి అయినా ఆండ్రియాకు చెప్పడం అందుకు ఆమె ఒప్పుకోక పోవడంతో దుర్బాషలాడినట్లుగా దర్శకుడు చెబుతున్నాడు.

ఇండస్ట్రీలో సీనియర్‌లతో పాటు అందరితో గౌరవంగా ఉంటేనే పైకి ఎదగగలరు.కాని అను ఎమాన్యూల్‌ మాత్రం తన సీనియర్‌ కో స్టార్స్‌కే గౌరవం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తుంది.దాంతో ఈమెకు కెరీర్‌లో గడ్డు పరిస్థితులు ఎదురవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ఇలాంటి ప్రవర్తన ఉన్న వారు ఇండస్ట్రీలు పైకి వచ్చినట్లుగా లేదు అంటూ ఆమెపై నెటిజన్స్‌ కౌంటర్స్‌ వేస్తున్నారు.ఫ్లాప్‌ల్లో ఉన్నా కూడా ఇంత బలుపు దేనికి అమ్మడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు