పవన్‌తో చేసిన పాపానికి ఈ దుస్థితి       2018-05-25   01:06:22  IST  Raghu V

నాగచైతన్య హీరోగా నటించిన మజ్ను చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అను ఎమాన్యూల్‌ ఆ తర్వాత మంచి ఆఫర్లు దక్కించుకుంది. మెల్ల మెల్లగా స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే మెగా హీరో పవన్‌, అల్లు అర్జున్‌లకు జోడీగా నటించే అవకాశాలు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. అదే ఇప్పుడు అను ఎమాన్యూల్‌ విషయంలో రుజువు అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకుని నటించిన అజ్ఞాతవాసి చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. పవన్‌తో నటిస్తే కెరీర్‌లో సెటిల్‌ అయ్యి పోవచ్చు అని ఆశించిన అనుకు నిరాశే మిగిలింది.

అజ్ఞాతవాసి సక్సెస్‌ కాకపోయినా కూడా ఆమెపై నమ్మకంతో, ఆమె అందంకు ముగ్దుడు అయిన దర్శకుడు వక్కంతం వంశీ తన నా పేరు సూర్య చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా ఎంపిక చేశాడు. అల్లు అర్జున్‌ కూడా అనుపై నమ్మకం పెట్టుకుని నటించాడు. కాని నా పేరు సూర్య కూడా సర్వనాశనం అయ్యింది. ఎంతో అంచనాలు పెట్టుకున్న నా పేరు సూర్య మరియు అజ్ఞాతవాసి చిత్రాలు మినిమం సక్సెస్‌ను దక్కించుకోలేక పోవడంతో అను ఎమాన్యూల్‌ పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది. ఈమె అంతుకు ముందే కమిట్‌ అయిన సినిమాల నుండి కూడా తొలగించారు.

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రం నుండి అనును తొలగించిన నేపథ్యంలో ఇక అను కెరీర్‌ ఖతం అంటూ అంతా భావిస్తున్నారు. అయితే నాగచైతన్యతో నటిస్తున్న శైలజ రెడ్డి అల్లుడు తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని, మారుతి తనకు సక్సెస్‌ను ఇస్తాడనే నమ్మకంతో అను ఇండస్ట్రీలో కొనసాగుతుంది. శైలజ రెడ్డి అల్లుడు వచ్చే వరకు ఏదో ఒక సినిమాను కమిట్‌ అవుతూనే ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక చిన్న పాత్రకు తాజాగా ఈమె ఓకే చెప్పింది. స్టార్‌ హీరోల సరసన గత సంవత్సరం నటించిన అను కొన్ని నెలల గ్యాప్‌లోనే చిన్న పాత్రలకు పరిమితం అవ్వడం నిజంగా షాకింగ్‌ అని చెప్పుకోవచ్చు.

అను ఎమాన్యూల్‌ తాజాగా విజయ్‌ దేవరకొండ హీరోగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో చిన్న పాత్రలో ఎంపిక అయ్యింది. గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో ఆ చిత్రం తెరకెక్కుతున్న కారణంగా అను ఎమాన్యూల్‌ మారు మాట్లాడకుండా ఆ చిత్రంలో చిన్న పాత్ర అయినా చేసేందుకు కమిట్‌ అయ్యింది. చిన్న పాత్ర, పెద్ద పాత్ర అంటూ ఆలోచిస్తే కెరీర్‌ పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉందని ఆమె ఆందోళన చెందుతుంది. అందుకే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన సత్తా చాటి టాలీవుడ్‌ స్టార్‌ అవ్వాలని కోరుకుంటుంది. మరి ఆమె అనుకున్నది సాధ్యం అయ్యేనా చూడాలి.