పవన్‌, అల్లు అర్జున్‌ల వల్ల ఈ అమ్మడి కెరీర్‌ కొట్టుకు పోయిందట  

Anu Emmanuel About Pawan And Allu Arjun-anasuya,anu Emmanuel,koratala Siva,pawan Kalyan,rahul Sipligunj,srimukhi,tollywood Gossips

నాని హీరోగా నటించిన మజ్ను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళి ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్‌ చాలా కొద్ది కాలంలోనే కనుమరుగయ్యింది.చేసినవి కొద్ది సినిమాలే అయినా కూడా మంచి స్టార్స్‌తో చేసింది.కాని ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు సక్సెస్‌ తెచ్చి పెట్టలేక పోయాయి.

Anu Emmanuel About Pawan And Allu Arjun-anasuya,anu Emmanuel,koratala Siva,pawan Kalyan,rahul Sipligunj,srimukhi,tollywood Gossips-Anu Emmanuel About Pawan And Allu Arjun-Anasuya Anu Koratala Siva Pawan Kalyan Rahul Sipligunj Srimukhi Tollywood Gossips

ప్రస్తుతం తమిళంలో ఒక చిన్న సినిమాను చేస్తున్న ఈ అమ్మడు ఆ తర్వాత ఎలాంటి సినిమాలకు కూడా కమిట్‌ అవ్వలేదు.అందుకే ఈ అమ్మడి కెరీర్‌ ఖతం అయినట్లే అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌లో అను ఎమాన్యూల్‌ కెరీర్‌ చాలా తక్కువ కాలంలోనే ముగియడానికి కారణం పవన్‌ కళ్యాణ్‌ మరియు అల్లు అర్జున్‌ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

వారిద్దరితో అను ఎమాన్యూల్‌ అజ్ఞాతవాసి మరియు నాపేరు సూర్య చిత్రాలు చేసింది.ఆ రెండు సినిమాలు కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి.ఆ రెండు సినిమాల ప్రభావం అనుపై చాలా గట్టిగా పడింది.ఆ చిత్రాలు మాత్రమే కాకుండా శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో కూడా ఈ అమ్మడు నటించింది.

ఆ చిత్రం కూడా ఫ్లాప్‌ అవ్వడంతో అనుకు తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ అనఫిషియల్‌గా గుడ్‌ బై చెప్పేశారు.ఆమెతో సినిమాలు చేస్తే అంతే పరిస్థితి అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.అందుకే ఆమెకు అస్సలు ఆఫర్లు రావడం లేదు.ఐరెన్‌ లెగ్‌ అంటూ ముద్రపడ్డ హీరోయిన్స్‌కు ఛాన్స్‌లు రావడం అంటే అంత సులువైన విషయం కాదు.

అందుకే అనుకు ఇకపై ఛాన్స్‌లు వస్తాయన్న నమ్మకం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.