అజ్ఞాతవాసితో పోయిన బ్యూటీ అల్లుడితో అయినా బిజీ అయ్యేనా?

కొందరు హీరోయిన్స్‌ కెరీర్‌ ఆరంభంలో లక్కీగా స్టార్‌ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంటారు.కాని వారికి ఆ లక్‌ కలిసి రాదు.

 Anu Emanuel Once Again Entering To Tollywood, Bellam Konda Sai Srinivas, Sonu So-TeluguStop.com

స్టార్‌ హీరోలతో సినిమాలు చేసినా కూడా కెరీర్‌ లో నిలదొక్కకోలేక ఇబ్బందులు పడి చివరకు కనిపించకుండా పోతారు.నాగచైతన్య, నాని, అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్స్ తో నటించిన అను ఎమాన్యూల్‌ అనూహ్యంగా రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయింది.

తెలుగులో ఈమెకు ఆఫర్లు రాకపోవడంతో వేరే భాషల్లో నటించేందుకు సిద్దం అయ్యింది.అక్కడ అడపా దడపా ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చింది.

ఎట్టకేలకు మళ్లీ తెలుగులో ఈమెకు అల్లుడు అదుర్స్ సినిమాలో సెకండ్‌ హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది.తెలుగు సెకండ్‌ హీరోయిన్‌ కు వచ్చేంత కూడా వేరే భాషల్లో మెయిన్‌ హీరోయిన్‌ కు రాదు.

కనుక తెలుగులో నటించేందుకు చాలా మంది హీరోయిన్స్ ఆశ పడుతూ ఉంటారు.

Telugu Allu Arjun, Alludu Adurs, Anu Emanuel, Pawan, Telugu-Movie

అను ఎమాన్యూల్‌ కూడా పవన్‌ వంటి స్టార్‌ తో నటించి ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో నటించేందుకు ముందుకు వచ్చింది.ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు.అల్లుడు అదుర్స్ సినిమా ఫలితంపైనే ఈమెకు ఆఫర్లు ఆదారపడి ఉన్నాయి.

తెలుగులో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.కాని ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.

తెలుగు సినిమాల్లో ఈమె మళ్లీ బిజీ అవ్వాలంటే అల్లుడు అదుర్స్‌ సక్సెస్‌ అవ్వాలి దానికి తోడు సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడాలి.అప్పుడే ఈ అమ్మడు నటించేందుకు ఆఫర్లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అజ్ఞాత వాసి సినిమాతో పోయిన క్రేజ్‌ మళ్లీ ఈ సినిమాతో అయినా వస్తుందా అంటూ నెటిజన్స్ వెయిట్‌ చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అల్లుడు అదుర్స్‌ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube