అమెరికన్స్ కు మరో సారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఫౌసీ...!!!

అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌసీ మరో సారి అమెరికన్స్ కు హెచ్చరికలు జారీ చేశారు.కరోనా మహమ్మారి అమెరికాలో మరో సారి విజ్రుంభిస్తున్న నేపధ్యంలో మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన ఫౌసీ ఈ సారి అమెరికన్స్ అజాగ్రత్త వహిస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే అంటూ వార్నింగ్ ఇచ్చారు.

 Antony Pouchi Strong Warning To American For Kovid-TeluguStop.com

గతంలో కంటే అమెరికాలో కరోనా పరిస్థితి ప్రస్తుతం మెరుగవుతోందని తెలిపిన ఫౌసీ అమెరికన్స్ గతంలో మాదిరిగా అజాగ్రత్తగా ఉండద్దని తెలిపారు.ఈ సారి నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని తెలిపారు ఫౌసీ.

కోవిడ్ నిభందనలు పాటిస్తూ ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పౌసీ కోరారు.ఈ క్రమంలోనే పౌసీ అమెరికన్స్ కు కొన్ని కీలక సూచనలు చేశారు.కొత్త కేసులు రాకుండా, మరణాల సంఖ్య పెరగకుండా ఉండాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయని ప్రభుత్వానికి సూచనలు చేశారు.అందులో ఒకటి ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టడం, రెండవది కరోనా విషయంలో ప్రతీ పౌరుడి జాగ్రత్త చర్యలు చేపట్టేలా నిభందనలు కటినతరం చేయడం.

 Antony Pouchi Strong Warning To American For Kovid-అమెరికన్స్ కు మరో సారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఫౌసీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రెండే అమెరికాను కరోన బారి నుంచీ కాపాడుతాయని సూచించారు.ఫౌసీ మాటలు పక్కన పెడితే.

అమెరికాలో కరోనా వ్యాక్సిన్ వ్యాప్తి పై నిత్యం పరిశోధనలు చేస్తున్న హాప్కిన్ యూనివర్సిటీ తాజాగా అమెరికాలో కరోనా పరిస్థితులు ప్రకటించింది.అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం ౩ కోట్ల 17 లక్షలు ఉండగా కొత్తగా 30 లక్షల కేసులు నమోదైనాయని తెలిపింది.దాదాపు 5.55 లక్షల మంది మృతి చెందారని ప్రకటించింది.దాదాపు 32 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోగా అందులో రెండవ సారి వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య కేవలం 18 శాతమేనని వ్యాక్సిన్ ప్రతీ ఒక్కరూ తీసుకోవడంతో కరోనా వ్యాప్తిని అరికట్టచ్చని ప్రకటించింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు