ముగ్గురు బాధితుల్లో ఒకరికి యాంటీబాడీస్ ఉత్పత్తి : సెరో సర్వే !

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు.వైరస్ వ్యాప్తి, కట్టడి చేసే అంశాలను కనుగొనడంలో బిజీ అవుతున్నారు.

 Antibody, Production, One In Three, Victims, Zero Survey-TeluguStop.com

కరోనా అడ్డుకునేందుకు కొత్త అంశాలతో ముందుకు వస్తున్నారు.తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో శాస్త్రవేత్తలు సెరో (సెరోలాజిక్) సర్వే నిర్వహించారు.

కరోనాపై నిర్వహించిన ఈ సర్వేలో సరికొత్త విషయాలను వెల్లడించారు.కరోనాతో బాధపడుతున్న ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరిలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని తెలిపారు.

ఢిల్లీ జనాభాలో దాదాపు 30 శాతం మంది కరోనా బారిన పడి కోలుకున్నారని, వీరిలో కరోనా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని సెరో పేర్కొంది.

దేశంలోని 11 జిల్లాల్లో సెరోలాజిక్ సర్వే నిర్వహించింది.

దాదాపు 17,000 శాంపిళ్లను సేకరించి పరీక్షించింది.అయితే ఈ సర్వేకు సంబంధించిన ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.

పూర్తి స్థాయిలో ప్రయోగం నిర్వహించిన తర్వాత వచ్చే వారంలో అధికారికంగా ప్రకటిస్తామని సెరోలాజిక్ వెల్లడించింది.ఆగస్టు 7వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు నిర్వహించిన రెండో సర్వేలో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో 30 శాతం మందిలో ప్రతిరోధకాలు లేవని, ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతుందన్నారు.

ఇప్పటివరకూ 15,000 శాంపిళ్లు పరీక్షించామని, మిగిలిన శాంపిళ్లు పరీక్షించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని సెరో ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube